1918 లోని మన్యర్ నది నుండి సఖ్య సాగర్ సరస్సు మరియు మాధవ్ సాగర్ సరస్సు ఏర్ప్దడ్డాయి. మాధవ్ నేషనల్ పార్క్కి చుట్టుపక్కల ఉన్న అడవులలో జీవ వైవిధ్యానికి ఈ సరస్సులు ఉపయోగపడతాయి. జంతువులు, పక్షులు ఇంకా సరీసృపాలు సామరస్యంగా జీవించడానికి ఉపయోగపడే పర్యావరణ వ్యవస్థకు ప్రధానమైనవి. సెయిలింగ్ క్లబ్ అనే బోటు క్లబ్ ఈ సఖ్య సాగర్ లేక్ లో ఉంది.
ఈ సరస్సు లోని ప్రశాంతమైన నీటిలో ప్రయాణానికి ఈ బోటు క్లబ్ చక్కటి అవకాశం కలిగిస్తుంది. ఫోటోగ్రఫీలంటే ఇష్టపడేవాళ్ళకు అలాగే వైల్డ్ లైఫ్ గురించి తెలుసుకోవాలనుకునే ఔత్సాహికులకు ఇది అనువైన ప్రదేశం. ఈ సరస్సు లో ని బోటు పై ప్రయాణం చేస్తూ చుట్టూ పచ్చటి అడవుల మధ్య ప్రశాంతమైన పడవ ప్రయాణం లో సూర్యాస్తమయం వీక్షించడం మరపురాని దృశ్యం. మోనిటర్ లిజార్డ్, పైథాన్ మరియు మార్ష్ క్రొకోడైల్ వంటివి చూడడానికి ఉదయం అనువైన సమయం.



Click it and Unblock the Notifications