శివపురి లో ని విష్ణువు కొలువై ఉన్న ఆలయం సిద్దేశ్వర ఆలయం. సమృద్దిగా వన్యప్రాణులతో అభివృద్ధి చెందుతున్న ప్రాంతం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగినది. శివపురి లో ఉన్న అనేకమైన ఆలయాలు మొదటి చూపులో ఒకేలా అనిపించినా వేటికవే ప్రత్యేకత చెందినవి. ప్రతి ఆలయం, వాటి వయస్సుతో సంబంధం లేకుండా ఆధ్యాత్మికంగా ప్రాధాన్యత చెందినవి.
మహా విష్ణువుకి అంకితమివ్వబడిన పురాతనమైన ఆలయం సిద్దేశ్వర టెంపుల్. ఈ ఆలయ నిర్మాణం ఆ సమయం లో నిర్మితమైన హిందూ దేవాలయాలతో పోలిక కలిగి ఉంటుంది. ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి విష్ణు, శివుడు, గణేశుడు, రాముడు, కృష్ణుడు, పార్వతి మరియు లక్ష్మీ దేవి విగ్రహాలు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తాయి.



Click it and Unblock the Notifications