జాయ్ సాగర్ ట్యాంక్ ను అహోం రాజు స్వర్గ దేవ్ రుద్రా సిన్ఘ 1697 లో నిర్మించాడు. ఈ ట్యాంక్ రాంగ్ పూర్ సమీపం లో కలదు. దీనిని 45 రోజులలో రాజు యొక్క తల్లి జాయ్ మతి పేరుపై నిర్మించారు. దేశం లోనే అతి పెద్దదైన ఈ మానవ నిర్మిత సరస్సు. ఇది సుమారు 318 ఎకరాలలో కలదు.
ఈ సరస్సు చుట్టూ కేశవ రాయి విష్ణు, దేవి ఘర్, వైద్యనాధ్ శివ, శ్రీ సూర్య మందిర్, ఘన శ్యాం దాల్, గణేష్ మందిర్ లు కలవు. ఈ టెంపుల్స్ అన్నీ ట్యాంక్ కు ఉత్తర భాగాన వుంటాయి. వీటిలో విష్ణు టెంపుల్,దేవి ఘర్, శివ టెంపుల్, మరియు ఘన శ్యాం టెంపుల్ ప్రధాన ఆకర్షణలు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు సందర్శిస్తారు. విష్ణు గుడి చక్కని శిల్ప శైలి కలిగి వుంటుంది.



Click it and Unblock the Notifications