ఈ శివాలయాన్ని 1734 లో అహోం రాజు భార్య రాణి అంబిక నిర్మించారు. భూమి నుండి చాలా ఎత్తుగా 195 అడుగుల ఎత్తులో వుంటుంది. బహుశా, ఇండియాలోనే ఎత్తైన శివాలయంగా చెప్పవచ్చు. ఈ టెంపుల్ కు పైన ఎనిమిది అడుగుల ఎత్తు బంగారు డోమ్ కలదు.
ఈ ప్రదేశం ప్రతి సంవత్సరం శివరాత్రి పండుగకు అనేక మంది టూరిస్టులను, స్థానిక భక్తులను ఆకర్షిస్తుంది. టెంపుల్ గ్రౌండ్ లో ఒక పెద్ద మేళ నిర్వహిస్తారు. శివాలయానికి పక్కనే విష్ణు గుడి కూడా కలదు. టెంపుల్ సమీపంలో పురాతన అహోం పాలన నాటి ఫిరంగులు కూడా చూడవచ్చు.



Click it and Unblock the Notifications