Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» సింకెరిమ్

సింకెరిమ్  - ప్రశాంతత లో అద్భుత విశ్రాంతి!

11

సింకెరిమ్ బిజీ ప్రాంతమే. కాని ప్రశాంతత కలిగి ఉంటుంది. గోవాలోని పార్టీలు, బీచ్ ల మధ్య విసుగెత్తిన పర్యాటకులు ఈ బీచ్ లో రిలాక్స్ అవచ్చు. సింకేరిం బీచ్ రాజధాని పనాజికు మరియు ప్రసిద్ధ కండోలిం బీచ్ కు 13 కి.మీ.ల దూరంలో మాత్రమే కలదు. కనుక ఇక్కడకు చేరటం తేలిక.

బీచ్ ప్రశాంతంగా ఉండి కొన్ని నీటి క్రీడలను కూడా అందిస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే బ్రోకర్ల వంటి వారు కూడా ఇక్కడ ఉండరు. ఈ ప్రాంతంలో మీరు ఒక పిక్ నిక్ స్పాట్ కొరకు చూస్తూ ఉంటే, సుమారు 2 కి.మీ.ల దూరంలో అర్వలం జలపాతాలున్నాయి. ఈ జలపాతాలు సుమారు 50 మీటర్ల ఎత్తునుండి పడతాయి. ఎంతో శుభ్రమైన కొండల నీరు ప్రవహిస్తుంది. ఈ జలపాతాలు రుద్రేశ్వర్ దేవాలయానికి సన్నిహితంగా ఉంటాయి. అక్కడనుండి సమీపంలోని అరవలం గుహలు కూడా చూడవచ్చు. అయితే, అధిక సమయం ఇక్కడ వెచ్చించాల్సిన అవసరం లేదు.  

మరోమారు సింకేరిం బీచ్ పరిశీలిస్తే, ఇక్కడ అనేక షాక్స్ లేదా గుడిసెలు ఉంటాయి. వీటిలో చవకబారు ఆల్కహాల్ తో పాటు రుచి పచి లేని గోవా ఆహారాలు లభిస్తాయి. కండోలిం నుండి సింకేరిమ్ రావటం తేలిక. టాక్సీలు, రిక్షాలు ఉంటాయి. పాణజిం నుండి ఉత్తరంగా వెళ్ళే బస్ లేదా టాక్సీలు లభ్యంగా ఉంటాయి. లేదా పాణజిం లో బైక్ అద్దెకు తీసుకొని సింకేరిం, ఇంకా ఇతర బీచ్ లైన కండోలిం, అంజునా, బాగా మరియు కాలన్ గూటే లు కూడా చూడవచ్చు.   

సింకెరిమ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సింకెరిమ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం సింకెరిమ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? సింకెరిమ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం రోడ్డు ప్రయాణంలో ముంబై - గొవా రహదారి లేదా నేషనల్ హై వే 17 ముంబై నగరాన్ని గోవాకు నేరుగా కలుపుతుంది. రోడ్డు రెండు లేన్లు మాత్రమే కలిగి ఉండి కొద్దిపాటి అసౌకర్యంగా ఉన్నప్పటికి, ఆలస్యం అవుతున్నప్పటికి పర్యాటకులు దీనినే ఇష్టపడతారు. సౌకర్యవంతమైన రోడ్డు ప్రయాణం అంటే, ముంబై నుండి 8 లేన్ల ఎక్స్ ప్రెస్ మార్గంలో పూనే చేరి సతారా హై వే లో సావంత్ వాడి వరకు ప్రయాణించవచ్చు. అక్కడినుండి గోవా కొద్ది నిమిషాలలో చేరుకోవచ్చు. మహారాష్ట్ర లోని ముంబై, పూనే మరియు ఇతర నగరాలనుండి గోవాకు సౌకర్యవంతమైన బస్సులు కలవు. ఓల్వో సెమీ స్లీపర్ బస్సులు సౌకర్యంగా ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం గోవా దేశంలోని ఉత్తర, దక్షిణ మరియు మధ్య ప్రాంతాలకు రైలు సౌకర్యం కలిగి ఉంది. పర్యాటకులు ముంబై నుండి గోవా చేరేందుకు అనుకూలమైన వేళలున్నందున రైలు ప్రయాణం ఎంపిక చేస్తారు. ఒక్క రాత్రి ప్రయాణంలో గోవా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం దక్షిణ గోవాలోని డబోలిం విమానాశ్రయం నుండి ముంబై, ఢిల్లీ మరియు బెంగుళూరు వంటి మహానగరాలకు విమాన సౌకర్యం కలదు. విమానాశ్రయం నుండి క్యాబ్ లు తేలికగా దొరుకుతాయి. డబోలిం అంతర్జాతీయ లేదా కస్టమ్స్ ఎయిరో పోర్టు కాదు కనుక విదేశీ పర్యాటకులు దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు కల ముంబై లేదా ఢిల్లీ ల ద్వారా గోవా చేరాలి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue