Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» శ్రీశైలం

శ్రీశైలం - ఒక పవిత్ర నగరం

18

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా లో నల్లమల కొండలలో చిన్న పట్టణం శ్రీశైలం హిందువులకు చాలా పవిత్ర మైనది. ఈ పట్టణం కృష్ణ నది ఒడ్డున కలదు.  హైదరాబాద్ ఈ పట్టణానికి సుమారు 212 కి. మీ. ల దూరం వుంటుంది. ఎంతో పవిత్ర యాత్రా స్థలంగా భావించే ఈ శ్రీశైలం పట్టణానికి లక్షలాది హిందువులు ప్రతి సంవత్సరం దేశం లోని అన్ని మూలల నుండి వచ్చి దర్శించుకుంటారు. ఈ టవున్ లో అనేక దేవాలయాలు, తీర్థాలు కలవు. భక్తులకు, పర్యాటకులకు కావలసిన వివిధ రకాల ఆకర్షణలు ఇక్కడ కలవు.

ఇక్కడి దేవాలయాలలో భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినది. దీనిలో  శివ పార్వతుల విగ్రహాలు వుంటాయి. ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడు గా మరియు, మాత పార్వతి దేవిని భ్రమరాంబ గా పూజిస్తారు. శివ భగవానుడికి గల 12 జ్యోతిర్ లింగాలలో శ్రీశైలం ఒకటి కావున, హిందువులు ఈ దేవాలయానికి చాల ప్రాముఖ్యతనిచ్చి దర్శనం చేసుకొంటారు. ఇక్కడ కల మల్లెల తీర్థం అనే జలపాతాల లో స్నానాలు ఆచరిస్తారు. ఈ నీటి లో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని మోక్షం వస్తుందని భావిస్తారు.

శ్రీశైలం కు ఎయిర్ పోర్ట్ లేదా రైలు స్టేషన్ లేనప్పటికీ తేలికగా చేరగల చక్కటి రోడ్ మార్గం కలదు. ఇది ఒక ఉష్ణమండల ప్రదేశం కావున, వేసవులు అధిక ఉష్ణోగ్రతలు కలిగి పర్యాటకులకు అసౌకర్యంగా వుంటుంది. శ్రీశైలం చూడాలంటే శీతాకాలం అనుకూలమైనది.

శ్రీశైలం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

శ్రీశైలం వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం శ్రీశైలం

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? శ్రీశైలం

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం శ్రీశైలం దేశం లోని ప్రధాన పట్టణాల కు రోడ్ మార్గం లో చక్కగా కలుపబడి వుంది. అనేక ప్రభుత్వ బస్సులు కలవు. అయినప్పటికీ, మీరు బస్సు టికెట్ల ని ముందుగా రిజర్వు చేసుకోవటం సూచించ తగినది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం శ్రీశైలం కు రైలు స్టేషన్ లేదు. సమీప రైలు స్టేషన్ గుంటూరు - హుబ్లి లైన్ పై కల మర్కాపూర్ లో కలదు. శ్రీశైలం కు ఇది సుమారు 85 కి. మీ.ల దూరం లో కలదు. బస్సు లేదా ప్రైవేటు టాక్సీ ల లో శ్రీశైలం చేరవచ్చు. బస్సు ప్రయాణం చవక.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం శ్రీశైలం పట్టణానికి ఎయిర్ పోర్ట్ లేదు. సమీప విమానాశ్రయం 201 కి. మీ. ల దూరం లో హైదరాబాద్ లో కలదు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ దేశం లోని ఇతర ప్రధాన నగరాలకు, మరియు విదేశాలకు కూడా అనుసంధానించబడి వుంది. విమానాశ్రయం నుండి శ్రీశైలం కు టాక్సీ ల లో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Apr,Wed
Return On
30 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Apr,Wed
Check Out
30 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Apr,Wed
Return On
30 Apr,Thu