కర్నాటక లోని కొడగు జిల్లాలో తడియాండమోల్ అతి పెద్ద పర్వత శిఖరంగా చెప్పాలి. ఇది పడమటి కనుమలలో 5,724 అడుగుల ఎత్తులో ఉంది. ట్రెక్కర్లకు, ప్రకృతి ప్రియులకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. కర్నాటకలో ఇది మూడవ ఎత్తైన శిఖరంగా చెపుతారు. తడియాండ మోల్ అంటే మళయాళం భాషలో ‘అన్నిటికంటే విశాలమైన, ఎత్తైనది’ అని అర్ధం.
నలంకాడ్ ప్యాలెస్ కూడా ఇక్కడ చూడదగిన ప్రదేశాలలో ఒకటి. తడియాండమోల్ శిఖరంపై అందమైన షోలా అడవులు ఉంటాయి. సహజ అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు తప్పక చూడవలసిన ప్రదేశం.



Click it and Unblock the Notifications