తిరువన్నమలై లో మరియు చుట్టు పక్కల ఉన్నటువంటి పురాతన మందిరం ఈ ఆది అన్నామలై దేవాలయం. అరుణాచలేశ్వర దేవాలయం కట్టడానికి శతాబ్దానికి పూర్వమే ఈ మందిరం నిర్మించబడింది. అందుకే ఇది 2000 సంవత్సరాల పుర్వానికి చెందినదని నమ్ముతారు. మొట్టమొదట ఈ మందిరం ఒక చిన్న చెక్క నిర్మాణం గా ఉండేదని నమ్ముతారు. ఆ తరువాత గోపురాలు నిర్మించబడ్డాయని చెక్క నిర్మాణం తొలగించబడి రాళ్లు ఇటుకలతో ఈ దేవాలయం పునర్నిర్మితమయిందని నమ్ముతారు. ఇప్పటి కట్టడం 1200 సంవత్సరాల ముందు ఉన్నదిగా చెప్పవచ్చు.
'ఆది' అంటే మొట్టమొదటిది అని ఇక్కడి ప్రాంతీయ భాషలో అర్ధం. ఈ మందిరానికి ఈ పేరు సరిగా సరిపోతుంది. ఈ మందిరం అరుణాచలేశ్వర టెంపుల్ కి చాలా ఏళ్ళకి మునుపే నిర్మితమైన ఆ మందిరం తో పోలిస్తే చిన్నది. అర ఎకరం లో నిర్మితమైంది.
ఇక్కడ పూజింపబడే లింగం సాక్షాత్తూ బ్రహ్మ చేతే ప్రతిష్టింపబడినదని నమ్ముతారు.