బెంగుళూరు నగరం పేరు చెపితే చాలు ప్రతి ఒక్కరికి ఇక్కడ తిరిగే లక్షలాది వాహనాలు, ట్రాఫిక్ జాములు, అందమైన ఎత్తైన భవనాలు. ఆహ్లాదకర పార్క్ లు గుర్తుకు వస్తాయి. మరి రాత్రి అయిందంటే చాలు, కన్నులకు ఇంపుగా ప్రతి ప్రదేశంలోనూ అనేక విద్యుత్ దీపాల కాంతులలో భవనాలూ, రోడ్లు, విహార ప్రదేశాలు, పార్క్ లు మొదలైనవి ధగ ధగ మంటూ ప్రతి ఒక్కరికి ఆనందం కలిగిస్తాయి.
ఇంతటి మహానగరం మధ్యన కలదు ఒక వన్య జీవుల విహార ప్రదేశం. అదే ప్రసిద్ధి చెందిన బంనేరఘట్ట నేషనల్ పార్క్. బెంగుళూరు నగరంలో వుండే వారికి ఇది ఒక వారాంతపు విహార ప్రదేశం. బయట నుండి వచ్చే పర్యాటకులకు, నగరానికి 25 కి. మి.ల దూరంలో కల ఈ బన్నెర ఘట్ట పార్క్ సందర్శనకు నగరం నలుమూలల నుండి అనేక ప్రభుత్వ బస్సు లు కలవు. పార్క్ సందర్శన వేళలు ఒక్క మంగళవారం రోజు మినహా, ప్రతి రోజూ ఉదయం 9.30 గం. నుండి సా. 5 గం. వరకు వుంటుంది.
ఉదయం వేళ బయలు దేరితే, ఎంతో సౌకర్యవంతంగా కుటుంబ సభ్యులతో ముచ్చటించుకుంటూ, వివిధ రకాల జంతువులు, పక్షులు, పాములు మొదలైనవి ఈ పార్క్ లో చూసి సాయంత్రానికి తిరిగి రావచ్చు. అతి త్వరగా సందర్శన ముగించాలనుకునే వారు మూడు లేక నాలుగు గంటల వ్యవధి లో కూడా ఇంత పెద్ద పార్క్ ను చూసి రావచ్చు.
మరి పర్యాటకులకు, నగర వాసులకు, ప్రత్యేకించి పిల్లలకు ఇన్ని ఆనందాలను అందించే బన్నెర ఘట్ట నేషనల్ పార్క్ ను ప్రస్తుతానికి అందమైన చిత్రాలలో చూసి ఆనందించండి.
బెంగుళూరు హోటల్ వసతులకు క్లిక్ చేయండి

ఎలిఫెంట్ సఫారి
గజరాజు సంచారం...ప్రయానికుల ఆనందం . ఈ పార్క్ ను 1971 లో స్థాపించారు. నేడు ఇండి బెంగుళూరు లో ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ.
చిత్ర కృప : Marc Smith

విశాలమైన నేషనల్ పార్క్
ఈ నేషనల్ పార్క్ మొదటగా సుమారు 25000 ఎకరాలలో విస్తరించి వుండేది. నేడు ఈ పార్క్ లో ఎన్నో విభిన్న జంతుసముదాయం చూడవచ్చు.
చిత్ర కృప : Marc Smith

సర్ప జాతి
ఈ పార్క్ లో అనేక సర్ప జాతులు చూడవచ్చు.
చిత్ర కృప : Jiths

సుందర దృశ్యం
నీటి ఒడ్డున సంచరించే ఒక తాబేలు
చిత్ర కృప : paVan

మొసళ్ళ అడ్డా
అడుగు పెట్టె ధైర్యం ఉందా ?
చిత్ర కృప: Marc Smith

వింత జీవాలు - సుందర దృశ్యాలు
వింత జీవాలు - సుందర దృశ్యాలు
చిత్ర కృప: Rishabh Mathur

మండు వేసవిలో మహా సర్పం
పాము నీరు తాగే దృశ్యం
చిత్ర కృప: Rishabh Mathur

మొసళ్ళు
ఈ కాపు ఎవరి కోసమో....
చిత్ర కృప Harsha K R

విశ్రాంతి
విశ్రాంతి వీటికీ అవసరమే....
చిత్ర కృప Harsha K R

హాయ్ ...హాయ్
రెక్క విప్పితే హుషారు...2006 లో స్థాపించ బడిన మొట్ట మొదటి బట్టర్ ఫ్లై నేషనల్ పార్క్
చిత్ర కృప: Rishabh Mathur

బటర్ ఫ్లై
ఒక చెట్టుపై వాలిన ఆకర్షణీయ సీతాకోక చిలుక
చిత్ర కృప: Anil kumar

పూవులా ఆస్వాదన
పూవుపై వాలిన ఆకర్షణీయ సీతాకోక చిలుక
చిత్ర కృప: Subharnab Majumdar

ఆకర్షణీయ చిత్రం
నేషనల్ పార్క్ లోని ఒక ఆకర్షణీయ దృశ్యం
చిత్ర కృప: Ajith Kumar

బతఫ్ ఫ్లై పార్క్
ఎర్రటి పూవులపై మరొక బటర్ ఫ్లై
చిత్ర కృప: Subharnab Majumdar

బటర్ ఫ్లై పార్క్
నల్లరేక్కల సీతాకోక చిలుక
చిత్ర కృప: Karthik Narayana

రంగు రంగుల ఆకర్షణలు
బటర్ ఫ్లై పార్క్ లో కనపడే మరొక ఆకర్షణీయ దృశ్యం
చిత్ర కృప : Subharnab Majumdar

తుమ్మెదలు
ఆకర్షణీయ తుమ్మెదలు
చిత్ర కృప : Kannan AS

బటర్ ఫ్లై
ఆకర్షణీయ దృశ్యం
చిత్ర కృప: Ajith Kumar

నేషనల్ పార్క్
అందమైన పూవులు
చిత్ర కృప: Subharnab Majumdar

నేషనల్ పార్క్
అపుడే వికసించిన పూవు
చిత్ర కృప: Premnath Thirumalaisamy

నేషనల్ పార్క్
అందాల పూల కొమ్మ
చిత్ర కృప : Natesh Ramasamy

పక్షులు
నేషనల్ పార్క్ లో మనోల్లాసం కలిగించే ఒక ఆకర్షణీయ పక్షి
చిత్ర కృప: balu

సరస్సు లో బాతు
సరస్సులో తేలియాడే ఒక బాతు దృశ్యం
చిత్రక్రుప: balu

మృగరాజు
ఈ పార్క్ అంతటికి నేనే రాజు అని గర్జిస్తున్న ఒక మృగరాజు
చిత్రక్రుప: Karthik Narayana

నేషనల్ పార్క్
నేషనల్ పార్క్ లో అరుదుగా కనపడే చారాల గుర్రం
చిత్ర కృప: Harsha K R



Click it and Unblock the Notifications
















