భారతదేశంలోని ఈ వినోద ఉద్యానవనాలను చూశారా?
వినోద ఉద్యానవనాలనేవి పిల్లలు మరియు పెద్దలకు ఒక అద్భుతమైన ప్రదేశం లాంటివి. ఈ ప్రాంతాలు యాభై ఏళ్ల ముసలివారిని కూడా వారి చిన్ననాటి రోజులను గుర్తుకు తెస్తాయి. ఇవి కుటుంబాలు, స్నేహితులను దగ్గరికి చేస్తాయి. ఈ సెలవుల్లో వినోద ఉద్యానవనాలను సందర్శించడం చాలామంది పిల్లలకు సరదాగా, ఉల్లాసంగా ఉంటుంది. మరి మీ పిల్లలకు ఈ ప్రాంతాలను చూపించాలనుకుంటున్నారా, అయితే మరెందుకాలస్యం. పిల్లలు మరియు పెద్దలను బాగా ఆకట్టుకునే భారతదేశంలోని వినోద ఉద్యానవనాల జాబితాను ఒకసారి చూద్దామా?
వాటర్ కింగ్‌డమ్ మరియు ఎస్సెల్ వరల్డ్ ముంబై
భారతదేశంలోనే 1999లో నిర్మించిన మొట్టమొదటి వినోద ఉద్యానవనం ఈ ఎస్సెల్ వరల్డ్. ఇది ముంబైలో ఉండే అత్యంత ప్రసిద్ధి చెందిన వినోద ఉద్యానవనం. ఈ వినోద ఉద్యానవనంలో వాటర్ వరల్డ్, బౌలింగ్ అల్లే, ఐస్ స్కేటింగ్‌తో పాటు 30 కంటే ఎక్కువ రైడ్‌లు ఉన్నాయి. ఇందులో జైక్లోన్ మరియు రెయిన్‌బో వంటివి పెద్దలకు మాత్రమే ఉండేటటువంటి రైడ్‌లు ఉన్నాయి. అయితే ఈ ప్రాంతంలో ఉండే బిగ్ యాపిల్ మరియు జూనియర్ గో కార్టింగ్ వంటి రైడ్‌లు పిల్లలకు మాత్రమే అత్యంత అనూకూలమైనవి. ఏప్రిల్ నుండి మేలో ఈ ప్రాంతాన్ని సందర్శించొచ్చు. ముంబైలోని బోరివలి నుండి నలభై ఐదు నిమిషాల దూరంలో ఉన్న గోరై క్రీక్‌లో ఎస్సెల్ వరల్డ్ ఉంది.

వండర్లా బెంగుళూరు
వండర్లా బెంగళూరు భారతదేశంలోని అతిపెద్ద వినోద ఉద్యానవనాలలో ఒకటి. ఈ పార్క్‌లో 55 ల్యాండ్ మరియు వాటర్ రైడ్‌లు, మ్యూజికల్ ఫౌంటెన్‌లు ఉన్నాయి. ఈ స్టేట్ ఆఫ్ ఆర్ట్ అమ్యూజ్‌మెంట్ పార్క్ ప్రపంచ స్థాయి సౌకర్యాలను కలిగి ఉంది. ఇందులో 12 వాటర్ రైడ్‌లున్నాయి. లేజర్ లైట్లు మరియు మ్యూజిక్ వినిపించే వెచ్చని నీటిజల్లులతో కూడిన ఇండోర్ డిస్కోథెక్ కూడా ఉంది. ఇండోర్ రైయిన్ డ్యాన్స్ కోసం ఇది ఎంతో అనువైన ప్రదేశం. ఈ వేసవిలో సందర్శించేందుకు ఈ ప్రాంతం అనువైనది. బెంగుళూరు మైసూర్ హైవేకి సమీపంలో ఉన్న బిడాడిలో, ప్రయివేట్ వాహనం ద్వారా చేరుకోవచ్చు.

వరల్డ్ ఆఫ్ వండర్స్, నోయిడా
ఈ వినోద ఉద్యానవనం కుటుంబం మరియు వారాంతంలో అనువైనది. ఇది అనేక రైడ్స్ మరియు వారాంతంలో అనువైనది. ఇది అనేక రైడ్స్ మరియు రెస్టారెంట్లను కలిగి ఉంది. డ్యాన్స్ ఫ్లోర్‌ల ఫంకీ సంగీతాన్ని కూడా ఆస్వాదించవచ్చు. ఈ వినోద ఉద్యానవనం కుటుంబం ఈవెంట్‌లు, పుట్టినరోజు వేడుకలు మరియు సమావేశాల కోసం ప్రత్యేక స్థలాలను కలిగి ఉంది. ఈ పార్క్ ఏడాది పొడవునా తెరచి ఉంటుంది. నోయిడా నుండి ఇది ప్రభుత్వ మరియు ప్రయివేట్ రవాణా ద్వారా సులభంగా చేరుకోవచ్చు. లేదంటే ఢిల్లీ లేదా గుర్‌గావ్ నుండి నోయిడా వరకు మెట్రోలో వెళ్లి, అక్కడి నుండి ఆటో లేదా క్యాబ్‌లో చేరుకోవచ్చు.

రామోజీ ఫిల్మ్ సిటి హైదరాబాద్
రామోజీ ఫిల్మ్ సిటిలోని ఈ ఫిల్మ్ కాంప్లెక్స్‌కు టాలీవుడ్‌లోని అత్యంత ప్రసిద్ధ చిత్రాలను నిర్మించిన చరిత్ర ఉంది. నేడు ఇది సినీ ప్రేమికుల కుటుంబాలకు అందమైన వినోద ఉద్యానవనంగా మారింది. ఇది మాత్రమే కాదు. కాంప్లెక్స్‌లో లైవ్‌షోలు ఉన్నాయి. బర్డ్‌పార్క్‌లతో కూడిన ఎకోజిన్, బంగీజంప్, పాత్రబాల్ షూటింగ్, జోర్బింగ్ మొదలైన వాటిని ఆస్వాదించగల అడ్వంచర్ పార్క్‌కూడా ఉంది. హైదరాబాద్‌లో ఉన్న ఈప్రాంతాన్ని సందర్శించేందుకు హైదరాబాద్ నుండి బస్సులు లేదా ఆటోలు, క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఐదున్నర వరకూ ఇది తెరచే ఉంటుంది. ఆ సమయంలో దీన్ని సందర్శించవచ్చు.



Click it and Unblock the Notifications















