Search
  • Follow NativePlanet
Share
» »మహాశివరాత్రి ....లింగాకార ఆవిర్భావం

మహాశివరాత్రి ....లింగాకార ఆవిర్భావం

వాయ గౌరీ వదనాబ్జ భృంగ సూర్యాయ దక్షాధ్వర నాశకాయ శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శ్రీకారాయ నమశ్శివాయ ||

అంటూ ముక్కంటిని స్తుతిస్తూ మహాశివరాత్రి రోజున ఎర్రటి ప్రమిదలతో దీపమెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. హిందూ మతం పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉన్నది.

ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. శివభక్తులు తెల్లవారుజామున లేచి, స్నానం చేసి, పూజలు చేసి , ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగరణము చేసి మరునాడు భోజనం చేస్తారు . రాత్రంతా శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుతారు. అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవము గొప్పగా జరుగుతుంది . పూర్వం శ్రీశైలం క్షేత్రంలో జరిగే ఉత్సవమును పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రము లో విపులం గా వర్ణించాడు. మహేశ్వరుడిని మహాశివరాత్రి రోజున లింగోద్భవమూర్తిగా ఉన్న ముక్కంటిని పూజిస్తే సకలసంపదలు చేకూరుతాయి.

శ్రీశైలం

శ్రీశైలం

శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునందు కర్నూలు జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రము. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము. మెలికలు తిరుగుతూ, లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం అయిన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి.

Photo Courtesy: arupdutta

ద్రాక్షారామం

ద్రాక్షారామం

ద్రాక్షారామంలో గల శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వార్ల దేవాలయం అతి ప్రాచీన సుప్రసిద్ధ శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని క్రీ.శ. 7,8 శతాబ్ధాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగాశాసనాల ద్వారా తెలుస్తొంది. ఇక్కడి మూలవిరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలసిన 14 అడుగుల శివలింగం,శుద్ధ స్ఫటికాకార లింగం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి త్రిలింగ దేశమని పేరు రావడానికి కారణమైన క్షేత్ర త్రయంలో ద్రాక్షారామంఒకటి. మిగిలిన రెండు క్షేత్రాలలో ఒకటి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరము కాగా, మరొకటి శ్రీశైలము. త్రిలింగ క్షేత్రాలలోఒకటిగా, అష్తాదశ శక్తిపీఠాలలో ద్వాదశ పీఠంగా, దక్షిణ కాశీగా, వ్యాస కాశీగా ద్రాక్షారామానికి ప్రశస్తి ఉంది.

Photo Courtesy: Adityamadhav

కాళేశ్వరం దేవాలయం

కాళేశ్వరం దేవాలయం

సుప్రసిద్ధశైవక్షేత్రాలలో మహాపుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన క్షేత్రం కాళేశ్వరం. ఇది కరీంనగర్‌ జిల్లాలో మారుమూల అటవీ ప్రాంతమైన గోదావరి నది ఒడ్డున నెలకొని ఉంది. అతి ప్రాచీన చరిత్ర గల కాళేశ్వరక్షేత్రానికి అనేకప్రత్యేకతలున్నాయి. మన రాష్ట్రంలోని శైవక్షేత్రాలలో శ్రీశైలంలోని మల్లికార్జునస్వామి, ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామి, కాళేశ్వరంలోని ముక్తీశ్వరాలయాలు ప్రసిద్ధిగాంచినవి. ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీనది ప్రవహించడం వలన త్రివేణి సంగమ తీరమైన దక్షిణకాశీగా ప్రసిద్ధిచెంది, శ్రీశైల, ద్రాక్షారామ, కాళేశ్వరం అనే త్రిలింగక్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచినది.. భారతదేశంలో ఎక్కడైనా ఒకే పానవట్టం మీద ఒకే లింగం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఒకే పానవట్టంపై రెండు లింగాలు ఉండటం విశేషం. కాళేశ్వరంలోని ప్రధానాలయానికి పశ్చిమం వైపు యమగుండం మీద సుమారు ఒక కి.మీ దూరంలో ఆదిముక్తీశ్వరాలయం ఉంది. ఈ ఆలయం చుట్టుప్రక్కల ప్రకృతి సిద్ధంగా విభూతి రాళ్లు లభించడం విశేషం.

Photo Courtesy: Tallamma

మహానంది

మహానంది

మహానంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రము మరియు ఒక మండలము. నంద్యాలకు 14 కి.మీ దూరంలో ఉన్న మహాక్షేత్రం మహానంది. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి. ఇక్కడి మహానందీశ్వర దేవాలయం 7వ శతాబ్ధినాటిది. ఈ ఆలయ శిల్పశైలిని బట్టి ఇది బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనాకాలం (680-696) నాటిదని అంచనా. ఇచ్చట గల శివలింగము ఎత్తుగా కాక కొంచెము తప్పటగ వుంటుంది. పుట్టలో గల స్వామివారికి ఆవు పాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవుని కొట్టగా పుట్టలో గల స్వామివారిని ఆవు తొక్కి నందు వలన లింగము కొంచెము అణిగివుంటుంది. ఆవు గిట్ట గుర్తు లింగముపై వుంటుంది. ఇచ్చట శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే జలం జలజలా ప్రవహించే దృశ్యం మహానంది ప్రత్యేకత.

Photo Courtesy: Yvramr

అమరేశ్వరాలయం

అమరేశ్వరాలయం

గర్భాలయంలో 15 అడుగుల ఎత్తులో పొడవుగా ఊన్న మహా శివలింగం దంతం రంగులో ఉంటుంది. ఈ శివలింగం అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో తలపై మేకు కొట్టినట్టు చెబుతారు. అందుకు సంబంధించిన ఆనవాళ్లు కూడా కనిపిస్తూ వుండటం విశేషం. ప్రతి యేటా విజయదశమి రోజున . మహా శివరాత్రి పర్వదినం రోజున ఇక్కడ స్వామివారికి . అమ్మవారికి అంగరంగ వైభవంగా కల్యాణోత్సవం జరిపించబడుతూ ఉంటుంది. చాముండికా సమేతుడైన అమరేశ్వరుడు ఇక్కడ విశేష పూజలను అందుకుంటూ ఉంటాడు. ఇక్కడి స్వామివారు త్రిగుణాలకు అతీతుడు అనే భావాన్ని ఆవిష్కరించేలా మూడు ప్రాకారాలతో ఆలయం కనువిందు చేస్తుంటుంది.

Photo Courtesy: Adityamadhav

కీసరగుట్ట

కీసరగుట్ట

కీసర, కీసరగుట్ట లేదా కేసరిగిరి తెలంగాణ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలము. కీసర, రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 25 కి.మీ దూరములో ఉన్నది. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గములో భాగమైన ఈ మండలంలో 15 గ్రామాలు ఉన్నవి. కీసర ఇక్కడ ఉన్న అతి పురాతన కీసరగుట్ట శివుని ఆలయమునకు ప్రసిద్ధి. "మహాశివరాత్రి" పండుగ రోజు ఆలయమును దర్శించుటకు రాష్ట్రము నలుమూలలనుండి భక్తులు విచ్చేయుదురు.

Photo Courtesy: J.M.Garg

కోటప్ప కొండ

కోటప్ప కొండ

ఏ దయ వలన దుహాలన్నీ సంపూర్ణంగా నశించి శాశ్వతానంద కైవల్య సిద్ధి లభిస్తుందో ఆ దయను దాక్షిణ్యం అంటారు .దీన్ని కల దైవమె దక్షిణా మూర్తి .ఆ దక్షిణా మూర్తి స్వరూపమే గుంటూరు జిల్లాలో ఉన్న కోటప్ప కొండ పై త్రికూటేశ్వర స్వామి .నరసరావు పేట కు పద్నాలుగు కిలో మీటర్ల దూరం లో ఎల్ల మంద ,కొండ కావూరు మధ్య ఉన్న పర్వతాన్ని ‘'త్రికూటాచలం ‘'లేక ‘'కోటప్ప కొండ''అంటారు.1857అడుగుల ఎత్తు ,1500ఎకరాల వైశాల్యం ,పన్నెండు కిలో మీటర్ల చుట్టుకొలత ఉండి కోటి ప్రభా భాసమానమైన దివ్య విరాజిత క్షేత్రం కోటప్ప కొండ.ఏ వైపు నుంచి చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయి .అవి బ్రహ్మ విష్ణు మహేశ్వర ప్రతి రూపాలు .త్రిమూర్త్యాత్మక దక్షిణామూర్తి అవతారమే త్రికూటేశ్వర పరమేశ్వరుడు .ఇక్కడ ధ్వజస్తంభం, అమ్మవారు లేకపోవటం ,కల్యాణం జరక్క పోవటం ప్రత్యేకతలు .ఈ కొండపై కాకులు వాలక పోవటంవింతలలో వింత .ఈ కొరతను తీర్చటానికా అన్నట్లు కోతులు మాత్రం అసంఖ్యాకం.జాగ్రత్తగా ఉండక పొతే చేతిలోని వన్నీ ‘'హనుమార్పణమే ‘' .

Photo Courtesy: T.sujatha

పచ్చల సోమేశ్వర దేవాలయం

పచ్చల సోమేశ్వర దేవాలయం

పట్టణ సమీపంలోని పానగల్లు ఉదయ సముద్రం ప్రక్కన ఉన్న పచ్చల ఛాయ సోమేశ్వర ఆలయాల్లో అద్భుతమైన కళాశిల్పాలతో కూడిన సంపద నిండివున్నది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే శిల్పాలు ఇక్కడి దేవాలయాల్లో విభిన్న రీతిలో ప్రతిష్టించారు. పానగల్లు దేవాలయాల్లో ఒకటి పచ్చల సోమేశ్వరాలయం, రెండవ ఆలయం ఛాయ సోమేశ్వరాలయం. పచ్చల సోమేశ్వర ఆలయం నాలుగు దిక్కులకు అభిముఖంగా రాతి కట్టడాలతో నిర్మితమైన నాలుగు దేవాలయాల క్షేత్రంగా ఉంది. స్తంభాలపై, కప్పుల పై చెక్కిన అష్టదిక్పాలక శిల్పాలు ప్రధాన ఆకర్షన. ఈ ఆలయాన్ని 25 వరుసలలో నిర్మించారు. పానగల్లు ఉదయ సముద్రం చెరువు పక్కన తూర్పు దిశలో త్రికుటాలయంగా ఉన్న ఛాయ సోమేశ్వరాలయంలో గర్భగుడి లోపల శివలింగంపై నీడ పడుతుందని పలువురు తెలిపారు. ఈ నీడ 24గంటలూ లింగంపై కదలకుండా వుండడం విషేశం. ఈ నీడ కారణంగానే ఈ ఆలయా నికి చాయ సోమేశ్వరాలయం అన్న పేరు వచ్చిందని తెలుపుతున్నారు.

Photo Courtesy: Adityamadhav

రామప్ప దేవాలయం

రామప్ప దేవాలయం

ఓరుగల్లు నేలిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప దేవాలయం. రామప్ప దేవాలయము తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 157 కిలోమీటర్ల దూరంలో మరియు కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఇది వరంగల్లు జిల్లాలో చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు కలదు. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది ఇది ఇప్పటికి వేల ఎకరాల పంటలకు అధారంగా ఉన్నది. పాలంపేట చారిత్రత్మాక గ్రామము కాకతీయుల పరిపాలనలో 13-14 శతాబ్ధాల మధ్య వెలుగొందింది. [1] కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించారు.

Photo Courtesy: Gokanag

శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాలో ఒక పట్టణము మరియు ఒక మండలము. ఈ పట్టణం స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే ప్రాచీనమైన మరియు పంచభూతలింగము లలో నాల్గవ దైన వాయు లింగము గల గొప్ప శైవ పుణ్యక్షేత్రము. ఇక్కడ రెండు దీపాలలో ఒకటి ఎప్పుడూ గాలికి కదులుతూ ఉంటుంది, మరొకటి ఎల్లప్పుడు నిశ్చలముగా ఉంటుంది. ఇక్కడ ఉండే కళ్ళు చెదిరే మూడు గోపురాలు ప్రాచీన భారతీయ వాస్తు కళకు నిదర్శనాలుగా,విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల యొక్క పనితనానికి కాణాచిగా నిలుస్తాయి. వీటిలో ఎత్తైన గాలి గోపురం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడింది. బాగా పెద్దదిగా కనిపించే వెయ్యి కాళ్ళ మంటపం కూడా ప్రధాన ఆకర్షణే. కళంకారీ కళకు కాళహస్తి పుట్టినిల్లు.

Photo Courtesy: Krishna Kumar Subramanian

యాగంటి

యాగంటి

యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం వున్నది. ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి వున్నది. దీన్ని దాటగానే రంగ మంటపం, ముఖ మంటపం, అంతరాళం, వున్నాయి. గర్బాలయంలో లింగ రూపం పై ఉమా మహేశ్వరుల రూపాలు కూడా వున్నాయి. శ్రీ పోతులూరి వీర బ్రంహం గారు రచించిన కాలజ్ఞనంలో యాగంటి బసవన్న రోజు రోజుకి పెరుగుతున్నాడని అన్నారు.. ఇక్కడున్న పుష్కరిణి లోనికి నీరు నంది నోటి నుండి వస్తూ వుంటుంది.

Photo Courtesy: Porusreddy

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+