Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ అమావస్య, పౌర్ణమి రోజుల్లో అమ్మవారి శక్తి రెట్టింపవుతుంది. అందుకే అఘోరాలు

ఇక్కడ అమావస్య, పౌర్ణమి రోజుల్లో అమ్మవారి శక్తి రెట్టింపవుతుంది. అందుకే అఘోరాలు

తారాపీఠ్ పుణ్యక్షేత్రానికి సంబంధించిన కథనం

దక్ష యాగం సమయంలో అవమానం పొందిన సతీదేవి ఆత్మార్పణ చేసుకోవడం, అటు పై ఆమె దేహాన్ని మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో 51 భాగాలుగా చేయగా అవి భూమి పై వివిధ ప్రాంతాల్లో పడిన విషయం తెలిసిందే. ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే శక్తి పీఠాలుగా ప్రజలతో పూజలందుకొంటున్నాయి. అలా సతీదేవి కనుగుడ్డు పడిన ఈ దసరా సందర్భంగా ఈ ప్రాంతాన్ని గురించి తెలుసుకొందాం.

అద్దె ఇంట్లో ఉంటున్నారా? ఇక్కడికి వెళితే మీ గురుబలం రెట్టింపవుతుందిఅద్దె ఇంట్లో ఉంటున్నారా? ఇక్కడికి వెళితే మీ గురుబలం రెట్టింపవుతుంది

మీలో సత్తువ ఉంటే 'ఆ' పనితో ఇక్కడ ఆమె ఒళ్లంత చమటలేమీలో సత్తువ ఉంటే 'ఆ' పనితో ఇక్కడ ఆమె ఒళ్లంత చమటలే

తారాపీఠ్, శక్తిపీఠం

తారాపీఠ్, శక్తిపీఠం

P.C: You Tube

పశ్చిమ బెంగాల్ లోని కొలకత్తకు దగ్గర్లోని బిరుబీమ్ నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. ఈ దేవాలయం శక్తి పీఠాల్లో అత్యంత ముఖ్యమైనది అని స్థానికులు చెబుతుంటారు.

తారాపీఠ్, శక్తిపీఠం

తారాపీఠ్, శక్తిపీఠం

P.C: You Tube

హిందువలకు అత్యంత పవిత్రమైన ఈ దేవాలయాన్ని అఘెరాలు, నాగసాదువులు ఎక్కువగా సందర్శిస్తుంటారు. అందువల్లే ఈ దేవాలయాన్ని అఘెర దేవాలయం అని అంటారు.

తారాపీఠ్, శక్తిపీఠం

తారాపీఠ్, శక్తిపీఠం

P.C: You Tube

ఇక్కడ సతీదేవి కనుగుడ్డు పడిందని చెబుతారు. బెంగాళీలో కనుగుడ్డును తార అని పిలుస్తారు. అందుల్లే మొదట చందీపూర్ అని పేరు ఉన్న ఈ ఊరి పేరు తారాపీఠ్ అని మారిపోయింది.

తారాపీఠ్, శక్తిపీఠం

తారాపీఠ్, శక్తిపీఠం

P.C: You Tube

ఈ దేవాలయంలో కాళికా రూపంలో అమ్మవారిని పూజిస్తారు. ఇక్కడి దేవతను శాంతపరచడానికి ప్రతి రోజూ ఉదయం జంతుబలి జరుగుతుంది.

తారాపీఠ్, శక్తిపీఠం

తారాపీఠ్, శక్తిపీఠం

P.C: You Tube

ఇక్కడ అమ్మవారిని కాళికామాత, భద్రకాళి, ఉగ్రకాళి అని పిలుస్తారు. ఈ దేవాలయానికి నాలుగు ప్రధాన ద్వారాలు ఉంటాయి. నల్లటి గ్రానైట్ రాయితో ఈ దేవాలయాన్ని నిర్మించారు.

తారాపీఠ్, శక్తిపీఠం

తారాపీఠ్, శక్తిపీఠం

P.C: You Tube

ఇక్కడ అమ్మవారి విగ్రహం మూడు అడుగుల ఎత్తు ఉంటుంది. కపాలమాలను హారంగా ధరించి ఉంటుంది. ఎర్రటి నాలుకను బయటకు చాచి, శిరోజాలు వదిలివేసి అమ్మవారు ఉంటారు.

తారాపీఠ్, శక్తిపీఠం

తారాపీఠ్, శక్తిపీఠం

P.C: You Tube

ఇక్కడ అమ్మవారి నుదుటి కుంకుమను భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. భక్తులు రుద్ర రూపంలో ఉన్న అమ్మవారిని శాంతపరచడానికి టెంకాయి, అరటి పండు, చీరలతో పాటు ఒక్కొక్కసారి విస్కీని కూడా అమ్మవారికి నైవేద్యంగా అందజేస్తారు.

తారాపీఠ్, శక్తిపీఠం

తారాపీఠ్, శక్తిపీఠం

P.C: You Tube

ఇక్కడ అమ్మవారు శివుడి ఎద పై కాలు ఉంచుకొని నిలబడి ఉంటుంది. అయితే భక్తులు కేవలం అమ్మవారి మొహం మాత్రం చూడటానికి వీలవుతుంది. పాత దేవాలయం పూర్తిగా ధ్వంసం అయిపోయింది.

తారాపీఠ్, శక్తిపీఠం

తారాపీఠ్, శక్తిపీఠం

P.C: You Tube

దీంతో ప్రస్తుతం మనం ఇప్పుడు చూస్తున్న దేవాలయం క్రీస్తుశకం 1225లో జగన్నాథ్ రే నిర్మింపజేశాడు. ముఖ్యద్వారంలో దుర్గాదేవి రూపాలు చెక్కగా ఎడమవైపు ఉన్న ద్వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం చిత్రీకరించారు.

తారాపీఠ్, శక్తిపీఠం

తారాపీఠ్, శక్తిపీఠం

P.C: You Tube

అదే కుడివైపున ఉన్న ద్వారం పై రామయణ కావ్యాన్ని అందంగా కూడా చిత్రీకరించారు. ఇక్కడ అమ్మవారి కనుగుడ్డు పడటం వల్ల ఈ దేవాలయం మిగిలిన శక్తిపీఠాలతో పోలిస్తే ఈ శక్తిపీఠానికి శక్తి ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు.

తారాపీఠ్, శక్తిపీఠం

తారాపీఠ్, శక్తిపీఠం

P.C: You Tube

అందువల్లే అఘోరాలు ఎక్కువగా ఈ దేవాలయానికి వస్తుంటారు. తాంత్రిక విద్యలను నేర్చుకొంటూ ఉంటారు. ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి రోజుల్లో అఘోరాలు రావడం ఎక్కువగా ఉంటుంది.

తారాపీఠ్, శక్తిపీఠం

తారాపీఠ్, శక్తిపీఠం

P.C: You Tube

ఆ రోజుల్లో అమ్మవారికి శక్తి రెట్టింపవుతుందని నమ్ముతారు. ఆరోజున అమ్మవారిని పూజిస్తే కోరిన కోర్కెలు వెంటనే తీరుతాయని స్థానిక భక్తుల విశ్వాసం. అందువల్లే ఇక్కడకు అనేక మంది భకతులు వస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X