హనీమూన్‌కు ఇండియాలోని అనువైన ప్రదేశాలు ఇవే
పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఎక్కడా చూసిన కొత్తజంటలు కనపడుతున్నారు. కొత్తగా పెళ్లయిన వారు ఈ వేసవిలో హానీమూన్‌కు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంటారు. మీ భాగస్వామితో కలిసి చల్లని ప్రదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నారా. అయితే భారతదేశంలో అలాంటి ప్రదేశాలకు కొదవే లేదు. మరెందుకాలస్యం హనీమూన్‌కు అనువైన కొన్ని ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్
ఈ వేసవిలో రొమాంటిక్ హాలిడేని ఆస్వాదించడానికి డార్జిలింగ్ ఉత్తమ ప్రదేశం అనే చెప్పుకోవాలి. భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న అందమైన లోయలలో విహరించడం నిజంగా ప్రత్యేకమైన అనుభూతి. డార్జిలింగ్ పర్యటన మిమ్మల్ని బ్రిటిష్ రాజ్ రోజులకు తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు తేలే మేఘాలు, టాయ్ ట్రైన్ గొండోలా రైడ్, పచ్చని టీ తోటలను ఆనందించవచ్చు. మొత్తంమీద ఇది హానీమూన్ జంటలకు ఒక రొమాంటిక్ హిల్ స్టేషన్. ఇక్కడ మీరు మీ భాగస్వామితో అందమైన క్షణాలను గడపొచ్చు.

ఊటీలో సందర్శించవలసిన ప్రదేశాలు
హానిమూన్‌కు దక్షిణాన ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే మాత్రం ఊటీ ఉత్తమ ఎంపిక. ఇది తమిళనాడు రాష్ట్రంలోని ఒక చిన్న పట్టణం. దీనిని హిల్ స్టేషన్ అని పిలుస్తారు. ఈ హిల్ స్టేషన్ దాని తోటలకు ప్రసిద్ధి చెందింది. మోతీ సరస్సు, ఎమరాల్డ్ లేక్, రోజ్ గార్డెన్, బొటానికల్ గార్డెన్, సెయింట్ స్టీఫెన్స్ చర్చి ఇక్కడ చూడదగిన ప్రదేశాలు. అంతే కాకుండా, భాగస్వామితో కలిసి ఇక్కడ సేదతీరేందుకు చాలా ప్రదేశాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి.

ఔలి, ఉత్తరాఖండ్
వేసవిలో హనీమూన్‌కి వెళ్లేందుకు ఔలి సరైన ప్రదేశం. ఇది ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ ప్రాంతంలోని చమోలి జిల్లాలో ఉంది. ఇది ఒక అద్భుతమైన హిమాలయ గమ్యస్థానం. ఈ ప్రాంతం వేసవిలో నూతన వధూవరుల జీవితాన్ని మరింత ప్రత్యేకంగా చేస్తుంది. వేసవిలో హనీమూన్ సెలవుల కోసం ఈ ప్రాంతం ఎంతో ఉత్తమమైనది. ఇక్కడ జంటలు వివిధ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాన్ని పొందుతారు. ఔలి భారతదేశంలోని అత్యుత్తమ స్కీయింగ్ గమ్యస్థానాలలో ఒకటి. వేసవిలో కూడా ఇక్కడ చలిని మీరు అనుభవించవచ్చు.

మౌంట్ అబూలో సందర్శించవలసిన ప్రదేశాలు
మౌంట్ అబు పశ్చిమ భారతదేశంలోని రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలోని ఆరావళి పర్వత శ్రేణిలో ఉన్న ఒక హిల్ స్టేషన్ . ఈ ప్రాంతం ఎత్తులు నదులు, సరస్సులు, జలపాతాలు మరియు సతత హరిత అడవులకు నిలయంగా ఉన్నందున దీనిని 'ఎడారిలో ఒయాసిస్' అని పిలుస్తారు. సమీప రైల్వే స్టేషన్ 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న అబు రోడ్ రైల్వే స్టేషన్ హనీమూన్ జంటలకు ఒక రొమాంటిక్ ప్రదేశం. ఈ ప్రాంతం కొత్తగా పెళ్లయినవారు వివాహ కార్యక్రమాల తర్వాత విశ్రాంతి తీసుకునేందుకు ఓ గొప్ప ప్రదేశం అనే చెప్పుకోవాలి. ఈ ప్రాంతంలో నక్కి సరస్సు మరియు సన్‌సెట్ వ్యూ పాయింట్‌ని సందర్శించడం మర్చిపోవద్దు.

సిక్కిం..
సిక్కిం భారతదేశపు హిమాలయ పర్వతశ్రేణులలో ఒదిగి ఉన్న ఒక రాష్ట్రం. భారతదేశంలో అన్ని రాష్ట్రాలకంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం. దక్షిణాన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఉంది. సిక్కిం అధికారిక భాష నేపాలీ. కొత్తగా పెళ్లయిన వారికి సిక్కిం స్వర్గధామం. రణగోణధ్వనులకు దూరంగా పర్వతాల మధ్య మనశ్శాంతిని కోరుకునే జంటలకు ఈ ప్రాంతం ఎంతో అనువైనదనే చెప్పుకోవాలి. ఇక్కడ గడిపిన ప్రతి ఒక్క క్షణం చిరస్మరణీయం అవుతుంది. సిక్కింలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో జులుక్ ఒకటి. ప్రకృతి ప్రేమికులు ఎవ్వరైనా ఈ ప్రాంతం సందర్శించడం మానరు. ఇక్కడ నుండి కాంచన్‌జంగా అద్భుతమైన దృశ్యాలు చూడొచ్చు.



Click it and Unblock the Notifications

















