మండు వేసవి తర్వాత జూన్ నెలలో దక్షిణ భారత దేశంలో ఋతుపవనాల కారణంగా జల్లులు పది ఆహ్లాదంగా వుంటుంది. ఈ సమయంలో కొన్ని ప్రదేశాలు పర్యటించి ఆనందించవచ్చు. పూర్తి విశ్రాంతి పొందవచ్చు.
కర్నాటక లోని కూర్గ్ లేదా దండెలి లేదా పాలక్కాడ్ , పొన్నాని వాణివి ఈ సమయంలో సరైన ప్రదేశాలు. హిల్ స్టేషన్ లు కోరే వారు ఏలగిరి, ఎర్కాడ్ వంటివి పర్యటించ వచ్చు. కనుక నేడే మీ లగేజ్ సర్దుకొని చిరు జల్లుల స్వాగతానికి రెడీ అవండి.
చెన్నై హోటల్ వసతులకు క్లిక్ చేయండి

బైన్దూర్
బైన్దూర్ కర్నాటక లోని ఉడుపి జిల్లాలో కల కుందాపుర లో కలదు. ఈ ప్రదేశం అక్కడ కల బీచ్ లు, చక్కని సూర్యాస్తమయ ప్రదేశాలకు ప్రసిద్ధి. ఈ చిన్న గ్రామంలో ఒక సోమేశ్వర టెంపుల్ కలదు. సముద్రపు ఒడ్డున కల ఈ గుడి భక్తులకు ఎంతో ప్రశాంతత ఇస్తుంది. అద్భుత శిల్పాలు, టెంపుల్ లో కల శివుడి లింగం తప్పక చూడదగినవి.

కూర్గ్
కొడగు గా పిలువబడే ఈ ప్రదేశం కర్నాటక లోని మల్నాడ ప్రాంతంలో కల పడమటి కనుమలలో కలదు. కూర్గ్ ను స్కాట్లాండ్ అఫ్ ఇండియా లేదా కర్నాటక యొక్క కాశ్మీర్ అని కూడా పిలుస్తారు. ఎల్లపుడూ పచ్చగా వుండే అడవులు, పచ్చటి లోయలు, పొగ మంచు రాలే కొండలు, విశాలమైన కాఫీ, టీ తోటలు, ఎత్తైన శిఖరాలు, వేగంగా పరుగులు పెట్టె జలపాతాలు వంటి వాటి తో కూర్గ్ ప్రదేశం పర్యాటకుడికి ఎన్నో ఆనందాలు అందిస్తుంది.

దండెలి
కర్నాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో కల దండెలి ఒకప్పుడు దండకారణ్యం కల ప్రదేశంగా వుండేది. మరొక కధనం మేరకు ఇక్కడ కల గ్రామ దేవత దండెలమ్మ నుండి కూడా ఈ పేరు వచ్చిందని కూడా చెపుతారు. ఈ కధలు ఏమైనప్పటికీ, ప్రస్తుతం దండెలి ఒక అంతర్జాతీయ పర్యాటక ప్రదేశంగా విలసిల్లుతోంది. దండెలి గోవా నుండి 125 కి. మీ. లు

జోగ్ ఫాల్స్
ప్రకృతి మానవుడికి ప్రసాదించిన బహుమతులలో జోగ్ జలపాతాలు ఒకటి. ఈ జలపాతం షరావతి నదినుండి ఏర్పడుతుంది. నాలుగు భాగాలుగా ప్రవహిస్తుంది. అవి రాజా, రాణి, రోవర్ మరియు రాకెట్ అని అంటారు. షుమారుగా 830 అడుగుల ఎత్తునుండి ఒంపు సొంపులతో క్రిందకు పడే ఈ జలపాతాలు వేలాది సందర్శకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. రమణీయమైన ఈ జలపాతాల అందం ఈ ప్రదేశానికి చుట్టుపట్ల గల పచ్చటి పరిసరాలతో మరింత అధికమవుతుంది. జోగ్ ఫాల్స్ అందాలను ఆనందించాలంటే అనేక ప్రదేశాలనుండి దానినిచూడవచ్చు.
Photo Courtesy: Bharath Achuta Bhat

కోవ్ లాంగ్ బీచ్
కోవ్ లాంగ్ బీచ్, తమిళ్ నాడు కోస్తా తీరంలో ఒక మత్స్యకారుల గ్రామం. బీచ్ ప్రియులకు ఆనందం కలిగిస్తుంది. ఇది చెన్నై కు సమీప ప్రదేశం కావటం వలన వారాంతపు సెలవులకు అనుకూలిస్తుంది. ఇక్కడ కల డచ్ కేజల్ ను ఒక రిసార్ట్ గా మార్చారు. ప్రతి సంవత్సరం ఎంతోమంది టూరిస్టులు వస్తారు. తాజ్ ఫిషర్ మాన్ కొవ్ గా చెప్పబడే ఈ ప్రదేశం విశ్రాంతిగా మీరు కొంత సమయం గడిపేందుకు బాగుంటుంది.
Photo Courtesy: Kmanoj

కొడైకెనాల్
కొడైకెనాల్ పశ్చిమ కనుమలలోని పళని కొండలలో ఉన్న అందమైన, సుందరమైన హిల్ స్టేషన్. ఈ పట్టణం దాని అత్యద్భుతమైన అందం, ప్రజాదరణ కారణంగా పర్వత యువరాణి అని నామకరణం చేయబడింది. సముద్ర మట్టానికి 2133 మీటర్ల ఎత్తులో ఒక పీఠభూమి పైన ఉన్న ఈ పట్టణం తమిళనాడు లోని ది౦డుగల్ జిల్లలో ఉంది.కొడైకెనాల్ పట్టణం పర-ప్పర్, గుండర్ లోయల మధ్యలో ఉంది. కొడైకెనాల్ కి ఉత్తరాన విల్పట్టి గ్రామం, పల్లంగి గ్రామం క్రింద వాలుగా ఒక కొండ ఉంది. తూర్పున, కొండల వాలు క్రింద పళని హిల్స్ ఉన్నాయి. కొడైకెనాల్ దక్షిణాన కంబం వ్యాలీ ఉంది, పడమరన మంజంపట్టి లోయ, అన్నామలై పర్వతాలకు దారితీసే ఒక పీటభూమి ఉంది. తమిళంలో కొడైకెనాల్ అంటే అర్ధం అడవుల బహుమతి.
Photo Courtesy: Nikhil1508

కొల్లి హిల్స్
కొల్లి హిల్స్ మధ్య తమిళ నాడులోని నమక్కల్ జిల్లాలో కలవు. ఈ ప్రదేశం చెన్నై నగరానికి సుమారు 349 కి. మీ. లు. ఈ కొండలు సుమారు 1000 నుండి 1200 మీ. ల ఎత్తులో సుమారు 280 చ. కి. మీ. ల విస్తీర్ణంలో కలవు. ఈ ప్రదేశం చేరాలంటే సుమారు 70 కొండ మార్గ వంపులు తిరగాలి. కనుక డ్రైవింగ్ లో నిపుణులు అయి వుండాలి. ఈ ప్రదేశంలో ఇంకనూ వాణిజ్య కార్యకలాపాలు చోటు చేసుకోలేదు. అందుకని ఎంతో ప్రశాంతంగా వుంటుంది.
Photo Courtesy: M. Karthikeyan

కోటగిరి
తమిళ్ నాడు లోని నీలగిరి జిల్లాలో కల కోటగిరి ఒక పెద్ద హిల్ స్టేషన్. దీనిని కూనూర్ మరియు ఊటీ హిల్ స్టేషన్ లతో సమానంగా చెప్పవచ్చు. మూడింటిలోను ఇది చిన్నది. అయినప్పటికి వాతావరణం పరంగా ఇది ఏ మాత్రం వాటికి తీసిపోదు. ఈ ప్రదేశంలో ఒక క్రైస్తవ మత ప్రచారకుని కుమారుడైన రాల్ఫ్ థామస్ హచ్కిన్ మన వేదాలను ఇంగ్లీష్ భాష లోకి తర్జుమా చేయుటకు ప్రారంభించాడు. ఈ హిల్ స్టేషన్ సముద్ర మట్టానికి 1793 మీటర్ల ఎత్తున కలదు. ట్రెక్కింగ్ చేసే వారికి మంచి ప్రదేశం. కనుక ఇక్కడ నీలగిరి లోని వివిధ భాగాలకు ట్రెక్కింగ్ లో తీసుకు వెళ్ళే మార్గాలు కలవు. ఈ లోతట్టు భాగాలలో ఇంకా మానవ నాగరికత విలసిల్ల లేదు. Photo Courtesy: sramana9

పులికాట్ సరస్సు
దేశంలో రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు పులికాట్ సరస్సు. అయితే కబ్జాదారుల ఆక్రమణ, పూడిక తీత పనులలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ సరస్సు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. బంగాళాఖాతాన్ని ఆనుకొని సుమారు 600ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 70 కిలోమీటర్ల పొడవు, 20 కిలోమీటర్ల వెడల్పులో ఈ పులికాట్ సరస్సు వ్యాపించి ఉంది. అదే వర్షాకాలంలో అయితే మరిన్ని చదరపు కిలోమీటర్లు విస్తరిస్తుంది. ఈ సరస్సులో 16 దీవులు, 30 గ్రామాలున్నాయి.
Photo Courtesy: GnanaskandanK

ట్రాన్క్విబార్
ట్రాన్క్విబార్ లేదా ఇది ఇంతకు ముందు తరంగంబడి గా పిలువబడిన ఈ పట్టణం తమిళనాడు లోని నాగపట్టణం జిల్లలో ఉంది. తరంగంబడి ని సాహిత్యపరంగా అనువదిస్తే "పాటలుపాడే అలల ప్రదేశం". గతంలో 1620 నుండి 1845 వరకు దీనిని డేనిష్ కాలనీ అని, ఇపుడు డేనిష్ భాష లో దీనిని ట్రాన్క్విబార్ అని పిలుస్తున్నారు. 17 వ శతాబ్దం ముందు నుండి 19 వ శతాబ్దం మధ్య వరకు ట్రాన్క్విబార్ ఎంతో కీర్తిని కలిగిఉంది, ఆ సమయంలో ఇది డేనిష్ వారి ఆధీనంలో ఉన్న ఒక ముఖ్యమైన ఓడ రేవు. Photo Courtesy: Esben Agersnap

ఏలగిరి
ఏలగిరి హిల్ స్టేషన్ గురించి చాలా మందికి తెలియదు. ఈ హిల్ స్టేషన్ ఊటీ లేదా కొడైకెనాల్ లకు ఏమంత తీసిపోదు. ఈ చిన్న హిల్ స్టేషన్ తమిళనాడు లోని వెల్లూరు జిల్లాలో కలదు. ఏలగిరి ఒక జమిందారు ప్రైవేటు ఆస్తి. అయినప్పటికీ భారత ప్రభుత్వం దీనిని 1950 లలో స్వాధీనం చేసుకొంది. అటవీ తెగలు నివసించే సుమారు 14 గ్రామాలు ఇక్కడ కలవు. ట్రెక్కింగ్ కు అద్భుత ప్రదేశం.
Photo Courtesy: cprogrammer

ఎర్కాడ్ హిల్స్
వేసవి వచ్చిందంటే, తమిళనాడు లోని సేలం జిల్లలో కల ఎర్కాడ్ హిల్స్ కు అనేకమంది పర్యటిస్తారు. ఈ హిల్ స్టేషన్ ఎంతో ప్రశాంతం, చల్లదనం. వేసవిలో విద్యార్ధులకు సెలవులు కూడా వస్తాయి కాబట్టి, దక్షినాది వారికి సమీపంలో కల ఎర్కాడ్ పిల్లలను, పెద్దలను అధిక సంఖ్యలో ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతానికి చాలా మంది కుటుంబ సమేత పర్యటన చేస్తారు. వాస్తవానికి సౌత్ ఇండియాలో హిల్ స్టేషన్ లు కొద్ది సంఖ్యలో కలవు. అది కూడా ఇక్కడ పడమటి కనుమలు, మరియు తూర్పు కనుమలు ఉండబట్టి. ఊటీ, మున్నార్, ఆగుంబే, చికమగాలూర్, కొడైకెనాల్, కూర్గ్ లు సౌత్ ఇండియాలో కల కొన్ని ప్రధాన హిల్ స్టేషన్ లు. అందమైన ఈ ఎర్కాడ్ హిల్ స్టేషన్ చెన్నై నుండి 360 కి. మీ. లు, బెంగుళూరు నుండి 228 కి. మీ. ల దూరంలో కలదు.
Photo Courtesy: Jai Kumara Yesappa

పాలక్కాడ్
పాలక్కాడ్ మద్య కేరళ రాష్ట్రానికి చెందిన ఒక పట్టణము,మరియు పాలక్కాడ్ జిల్లా కేంద్రం.దీని పూర్వ నామం పాలఘాట్.పశ్చిమ కనుమల గుండా ప్రవహించే పొన్నా నదికి సమీపంలో ఉంది.పాలక్కాడ్ కేరళ యొక్క మిగిలిన ప్రదేశాలకు భిన్నంగా ఉంటుంది.వరి ఎక్కువ పండిచటం,తాటి చెట్లు, ఆకుపచ్చ తీగలతో ప్రకృతి దృశ్యాలు, దట్టమైన ఉష్ణమండల అడవులు మరియు ఎత్తుపల్లాల కొండలు వీటి అన్నింటితో గ్రామీణ వాతావరణం కలిగి ఉంటుంది. కేరళలో బియ్యం ఉత్పత్తి ఎక్కువగా ఉండుట వల్ల పాలక్కాడ్ ను 'కేరళ ధాన్యాగారం'మరియు 'కేరళ రైస్ బౌల్' అని అంటారు.
Photo Courtesy: Me haridas

పీర్ మేడ్
కేరళ లోని కొట్టాయం లో తూర్పు దిశగా 75 కి.మీ. ల దూరంలో కల పీర్ మేడ్ పట్టణం కేరళ లోని ఆకర్షణీయ హిల్ స్టేషన్ లలో ఒకటి. పర్యాటకులకు కావలసిన ట్రెక్కింగ్ మార్గాలు, సుందరమైన ప్రకృతి దృశ్యాలు, చల్లని శృంగార భరిత వాతావరణం అన్నీ ఇక్కడ కలవు. ఎన్నో తోటలు కల ఈ పట్టణం దాని పేరును ట్రావెన్ కూర్ రాజ కుటుంబానికి సన్నిహితుడు అయిన పీర్ మహమ్మద్ అనే ఒక సూఫీ సెయింట్ నుండి పొందింది.
Photo Courtesy: Visakh wiki

పొన్నాని
కేరళలోని మలప్పురం జిల్లాలో పొన్నాని ఒక చిన్న సుందరమైన పట్టణం. పడమటి దిశగా అరేబియా సముద్రంచే చుట్టుముట్టబడిన ఈ పట్టణం మలబార్ కోస్తా తీరంలో ఒకప్రధాన మత్స్య కేంద్రం. పొడవైన బీచ్ లకు మరియు అనేక మసీదులకు పేరుగాంచింది. ఈ పట్టణం దక్షిణ భారత దేశంలోని పురాతన ఓడరేవు అయిన మలబార్ ఓడరేవు వాణిజ్య మరియు వ్యాపారాలకు ఎంతో ఎంతో తోడ్పడింది.
Photo Courtesy: Dhruvaraj S



Click it and Unblock the Notifications















