ఉదయపూర్ లోని సిటీ పేలస్ మ్యూజియం. ఈ భవన నిర్వహణకు అయ్యే ఖర్చు రాబట్టుకోవడానికి సిటీ పాలెస్ లో భాగమైన, సిటీ పాలెస్ మ్యూజియం ను 1969 లో ప్రజల సందర్శనార్ధం తెరిచారు. ఇక్కడ రాచ కుటుంబీకుల చిత్రాలూ, చాయా చిత్రాలూ ప్రదర్శించారు. ఇవి మేవార్ మహారాణాల చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి.
ఆయుధాలూ, రక్షణ కోసం వాడే యుద్ధ సామగ్రి ప్రదర్శించే మ్యూజియం కూడా ఇక్కడ ఉంది. మహారాణా ఆఫ్ మేవార్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించే ఈ మ్యూజియంలో శ్రీజీ అరవింద్ సింగ్ మేవార్ ప్రత్యెక చిత్రాలు ఉన్నాయి. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 దాకా దీనిని చూడవచ్చు.



Click it and Unblock the Notifications