Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉదయపూర్ » ఆకర్షణలు » పిచోలా సరస్సు

పిచోలా సరస్సు, ఉదయపూర్

3

ఉదయపూర్ లోని పిచోలా సరస్సుపిచోలా అనే ఊరిపేరిట ఏర్పడ్డ ఈ అందమైన కృత్రిమ సరస్సు క్రీ.శ. 1362 లో అభివృద్ది చేయబడింది. ఉదయపూర్ లో తాగు, సాగినీటి అవసరాలకు నిర్మించిన ఆనకట్ట వల్ల ఈ సరస్సు ఏర్పడింది. ఈ సరస్సు పరిసరాలను చూసి ముగ్ధుడైన మహారాణా ఉదైసింగ్ దీని వడ్డునే ఒక నగరాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. 696 హెక్టేర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ సరస్సు గరిష్టంగా 8.5 మీటర్ల లోతు ఉంటుంది. కాలక్రమేణా ఇక్కడి పరిసరాలను అభివృద్దిచేసి గుళ్ళు, రాజప్రాసాదాలు, భవంతులు కట్టారు.

ఈ సరస్సుకి దగ్గరలో, తాడుమీద నడిచే నాతిని అనే వనిత గౌరవార్ధం కట్టిన నాతినీ చబూత్రా అనే ఎత్తైన వేదికను కూడా యాత్రికులు చూడవచ్చు. ఈ సరస్సుని చేరుకోవడానికి యాత్రీకులు టా౦గాలను, టాక్సీలను బాడుగకు తీసుకోవచ్చు. పిచోలా సరస్సులో నాలుగు ద్వీపాలు ఉన్నాయి – లేక్ పాలెస్ ఉన్న జగ్ నివాస్, అదే పేరుతో భవంతి ఉన్న జగ్ మందిర్, ఏటా జరిగే గంగౌర్ పండుగను రాచ కుటుంబీకులు చూడడానికి ఉపయోగించిన మోహన్ మందిర్, ఆయుధాగారంగానూ, చిన్న భవంతిగానూ ఉపయోగించిన ఆర్సీ విలాస్. ఇక్కడ పిలకలున్న బాతులు, మామూలు బాతులు, కొంగలు, జామ పోలంకలు, డేగలాంటి పెద్ద కొంగలు, లకుముకిపిట్ట లాంటి పక్షులు మిక్కుటంగా ఉంటాయి.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue