చంద్రమౌళీశ్వర దేవాలయం కర్నాటకలోని హుబ్లీ ప్రాంతంలో ఉంకాల్ సర్కిల్ వద్ద ఉన్నది. దీనిని చాళుక్య రాజుల కాలంలో అంటే షుమారు 900 సంవత్సరాల క్రిందట నిర్మించినట్లు చెపుతారు.ఈ దేవాలయ ప్రధానాకర్షణలలో ...నాలుగు మహద్రవారాలు నాలుగు దిశలలో ఉంటాయి. రెండు పెద్ద శివలింగాలుంటాయి. నల్లటి గ్రానైట్ రాళ్ళతో కట్టబడిన గోడలపై, స్తంభాలపై అనేక శిల్పాలు చెక్కబడి ఉంటాయి. వచ్చిన పర్యాటకులకు ఆధ్యాత్మిక ఉపదేశంగా, నాట్య గణపతి, వంటి విగ్రహాలు కూడా దేవాలయంలో ఉన్నాయి. దేవాలయంలోని రాళ్ళపై చెక్కబడిన లిపి షుమారు 12వ శతాబ్దం నాటిది. ఈ దేవాలయం ఎంతో నైపుణ్యతగల శిల్పులచే నిర్మించబడింది. అయితే, చరిత్రలో దీనిని ఎవరు నిర్మించారనేది తెలియటంలేదు. హుబ్లీ పట్టణం నుండి చంద్రమౌళీశ్వర దేవాలయానికి అనేక రవాణా సౌకర్యాలున్నాయి. బస్సులు, టాక్సీలు, ఆటోరిక్షాలవంటివి నడుస్తాయి.



Click it and Unblock the Notifications