కుంజరుగిరి అనేది ఒక కొడ ప్రదేశం ఉడిపి కి ఆగ్నేయంగా 6 లేదా 7 మైళ్ళదూరంలో ఉంది. ఇక్కడ దుర్గాదేవి గుడి ప్రసిద్ధి. దీనిని మహర్షి పరశురాముడు నిర్మించాడని చెపుతారు. ఎత్తైన కొడలు ఏనుగలవలే కనపడటంతో దీనికి కుంజరుగిరి, కుంజర అంటే...కన్నడంలో ఏనుగు అనే పేరు వచ్చింది.
ఇక్కడ దుర్గాదేవి దేవాలయమే కాక పరశురామ దేవాలయం కూడా ఉంది. భక్తులు ఎంతో నిష్టతో వీరిని కొలుస్తారు. ఈ ప్రాంతం సందర్శకులకు ఒక ప్రత్యేక యాత్రా స్ధలాన్ని తలపిస్తుంది కుంజరుగిరి దుర్గాదేవి దేవాలయం చేరాలంటే ఉడుపి నుండి ఒక గంట సమయం పడుతుంది. ఉడుపి నుండి బస్, టాక్సీ, ఆటో రిక్షా వంటివి తేలికగా లభ్యమవుతాయి. ఈ గుడికి వెళ్ళే ప్రయాణీకులు ఉడిపిలో అతి తక్కవ వ్యయంతో హోటళ్ళలో బస చేయవచ్చు.



Click it and Unblock the Notifications