1622లో జహంగీరు చక్రవర్తి కొడుకు షాజహాన్ తన తండ్రి మీద తిరుగుబాటు చేసి బలవంతంగా సిమ్హాసనాన్ని అధిరోహించాలని చూసాడు కానీ తండ్రి చేతిలో పరాజయం పొందాడు. కానీ 1627 లో తన తండ్రి మరణించిన తరువాత చక్రవర్తి అయ్యాడు.
ఇతిబార్ ఖాన్ అనగా నమ్మిన బంటు అని అర్ధం. ఈయన జహంగీరు చక్రవర్తి ఆస్థానంలో రాజ కుటుంబ స్త్రీల నివాస సముదాయమైన హారంకి ఇన్ చార్జి.1623 లో జహంగీరు కొడూకు షాజహాన్ ఆగ్రాని ఆక్రమించదలచినప్పుడు ఆయనకి సహాయం అందించలేదు. ఈ నిజాయితీకి మెచ్చిన జహంగీరు చక్రవర్తి ఇతిబార్ ఖాన్ కి చిన్న ముంతాజ్ బేగం ని కానుకగా ఇచ్చాడు.
ఆనాటి సంప్రదాయం ప్రకారం ఇతిబార్ ఖాన్ తన సమాధి ని తాను బతికి ఉండగానే ఆగ్ర పొలిమేరల్లో నిర్మించాడు.ఈ సమాధి గురు కా తల్ గా పిలవబడే పెద్ద రిజర్వాయర్ ఒడ్డున ఉంది. కట్టడం పై భాగ గల 12 స్తంభాల వల్ల ఈ సమాధి ని బారహ్ ఖంబా అని పిలుస్తారు.ఇతిబార్ ఖాన్ సమాధి చతురస్రాకారం గా ఉంటుంది.దీనిలోనికి ఇసుక రాయి తో నిర్మించబడ్డ ద్వారం ద్వారా చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications