ఆహ్మేదాబాద్ నుండి సుమారు 10 కిలో మీటర్ల దూరం లో ఉన్న ఈ సాంచురీ నగర గజిబిజి జీవనం నుండి కొంచెం విరామం పొందడానికి అనువైన ప్రదేశం. ఈ సరస్సు అలాగే చుట్టుపక్కల ఏడూ చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని 1988 లో సాంచురీ గా ప్రకటించారు. ఎన్నో వలస పక్షులు ఈ ప్రాంతాన్ని స్తావరం గా చేసుకున్నాయి. చుట్టూ తడినేల కావడం వల్ల సమృద్దిగా లభించే కీటకాలు అలాగే నీటి మొక్కలు సమృద్దిగా లభించే నీటి వల్ల పక్షులు ఇక్కడికి వస్తాయి.
క్రాన్స్, ఫ్లమింగోస్, గీస్, డక్స్, స్పూన్ బిల్ల్స్, పెలికాన్స్, విస్లింగ్ తెఅల్స్, ఎగ్రేత్స్, హెరాన్స్ వంటి దాదాపు 100 రకాల పక్షి జాతులకి ఈ సాంచురీ స్థావరం. తడి నేల నుండి కీటకాలని తినే పొడవాటి కాళ్ళు అలాగే ఎర్రటి తలతో ఇండియన్ సారాస్ క్రేన్ ఎక్కువగా కనిపిస్తుంది. వర్షాకాలం తరువాత నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఈ సరస్సు ని సందర్శించేందుకు అనువైన సమయం.



Click it and Unblock the Notifications