అజ్మీర్ లోని దౌలత్ ఖానా ప్రస్తుతం ప్రభుత్వ మ్యూజియం గా వున్న దౌలత్ ఖానా దీర్ఘ చతురస్రాకారంలో వున్న పెద్ద భవంతి. ఈ ప్రాంతపు అందమైన శిల్పాలతో పాటు ఇక్కడ ముఘల్, రాజపుత్ర రాజులు వాడిన ఆయుధాలు కూడా వున్నాయి.
1613 – 1616 మధ్య ముఘల్ చక్రవర్తులు అక్బర్, జహంగీర్ దర్గా షరీఫ్ కు వచ్చినప్పుడు ఇక్కడే నివసించారు. రెండు మందమైన గోడల మధ్య వున్న ఈ మ్యూజియం బయట వున్న బోర్డ్ లో – ‘ఇంగ్లిష్ దౌత్యవేత్త సర్ థామస్ రో కు చక్రవర్తి ఇక్కడే స్వాగతం పలికారు’ అని రాసి వుంటుంది.
ఈ మ్యూజియం లో ప్రధానంగా రాజపుత్రులు, ముఘలాయిలు వాడిన ఆయుధాలు, 8వ శతాబ్దం నాటి హిందూ విగ్రహాలు వున్నాయి. ఇక్కడ వున్న కాళీ మాత విగ్రహం కూడా చెప్పుకోదగినది.‘మాగజైన్’ గా పిలువబడే ఈ మ్యూజియం ను 1908 లో లార్డ్ కర్జన్, సర్ జాన్ మార్షల్ చొరవతో ఏర్పాటు చేసారు. ఇందులో పుష్కర్, ఆడాయి దిన్ కా ఝోమ్ప్డా, బఘేరా, పిసంగాన్, హర్ష్నాద్ (సికార్) భరత్పూర్, సిరోహీ, అర్థునా, ఒసియాన్ లకు చెందిన అనేక శాసనాలు ఉన్నాయి.
ఇందులో ఇంకా చరిత్రకు ముందు కాలానికి చెందిన, మొహెంజో దారో లో దొరికిన అవశేషాలు, ఉక్కు మూసలు, వాటి చాయాచిత్రాలు భద్రపరచబడ్డాయి.ఈ మ్యూజియం ను, శెలవు దినాల్లో తప్ప, ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు తెరిచి ఉంచుతారు. భారత పౌరులకు ప్రవేశ రుసుము 5 రూపాయలు, కాగా విదేశీయులకు 10 రూపాయలు.



Click it and Unblock the Notifications