అజ్మీర్ లోని తెల్లని పాలరాయితో చేయబడిన షాజహాన్ మసీదు, దర్గా షరీఫ్ లోపలి ప్రాంగణంలో ఉంది. ఈ మసీదు తక్కువ ఎత్తులో వుండే తోరణాలతో, లోపలి భాగం తీగలతో చేసిన అల్లిక వంటి సున్నితమైన చెక్కుడు తొ 30.5 మీటర్ల పొడవైన ప్రాంగణంతో నిర్మించబడి ఉంది.
ఈ మసీదు విలక్షణమైన మొఘల్ శైలితో నిర్మించబడి, 11 తోరణాలను కలిగిఉంది. ఈ మసీదు 41 మీటర్ల ఎత్తులో, చలువరాతి గోపురంతో అద్భుతంగా నిర్మించబడింది. తాజ్ మహల్ కట్టిన పాలరాయిని ఏ గనులనుండి సేకరించారో, అదేగని నుండి ఈ మసీదు నిర్మాణానికి కూడా పాలరాయిని సేకరించారని ప్రజల నమ్మకం. ఆకుపచ్చ, తెల్లని రంగులతో ఉన్న ఈ మసీదుని మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించారు.



Click it and Unblock the Notifications