కాటార్మాల్ సన్ టెంపుల్ అల్మోర కు 16 కి.మీ.ల దూరంలో కలదు. ఒరిస్సాలోని సూర్య దేవాలయం తర్వాత ఇది సూర్యుడికి ప్రసిద్ధి చెందినది. ఈ టెంపుల్ 800 సంవత్సరాల ప్రాచీనమైనది. దీని చుట్టూ 45 చిన్న గుళ్ళు కలవు. శిదిలావస్థ లో ఉన్నప్పటికీ ఈ టెంపుల్ పర్యాటకులను ఆకర్షిస్తోంది. టెంపుల్ ఆవరణ లో శివ పార్వతుల, లక్ష్మి నారాయణ ల విగ్రహాలు కూడా చూడవచ్చు.
టెంపుల్ గోడలపై అనేక దేవతా మూర్తుల చెక్కడాలు కలవు. రికార్డుల మేరకు ఈ టెంపుల్ ను కాటర్మల్ అనే కత్యూరి రాజు 9 వ శతాబ్దం లో నిర్మించాడు. ఈ టెంపుల్ సముద్ర మట్టానికి 2116 మీ.ల ఎత్తున తూర్పు దిశలో సూర్య కిరణాలు శివలింగంపై పడే రీతిలో కలదు. ప్రధాన దేవత విగ్రహం 10వ శతాబ్దంలో దొంగిలించటంతో, మిగిలిన అందమైన ద్వారాలను, ఇతర చెక్కడాలను ఢిల్లీ లోని నేషనల్ మ్యూజియం లో భద్ర పరచారు.



Click it and Unblock the Notifications