సాహస క్రీడాకారులకు అంతరగంగ ప్రదేశం ఎంతో బాగా నచ్చుతుంది. అంతరగంగ అంటే నిరంతరం ప్రవహించే నీరు అని చెప్పవచ్చు. ఇది కర్నాటకలోని కోలార్ జిల్లాకు తూర్పు భాగంలో కొండలపై ఉంది. ఈ ప్రవాహం పెద్ద పెద్ద రాళ్ళ మధ్య నుండి ప్రవహిస్తూ కొండలపైనుండి దుముకుతుంది. ఈ కొండ చరియల శ్రేణిపై దట్టమైన అడవి కూడా ఉంది. దీనిని తప్పక చూడాలి. కొండ ప్రాంతం వచ్చేటప్పటికి పచ్చదనం తగ్గి అందమైన కిరీటాకారంలో ముళ్ళ పొదలుగా తయారవుతుంది.
పర్యాటకులకు వినోదం ఎలా? అంతరగంగ అందాలు దాని రాతి నిర్మాణాలలోను, గుహలలోను ఉన్నాయి. సాహసం ఇష్టపడేవారికి, అంటే పర్వతా రోహణ, ట్రెక్కింగ్ వంటివి చేసేవారికి ఈ ప్రదేశం మరువలేని అనుభూతులనిస్తుంది. ఇక్కడి గుహలు కూడా అన్వేషించదగినవే. ట్రెక్కింగ్ కనీసం ఒకటి రెండు గంటలు పడుతుంది. అయితే, కొండనుండి కిందకు వేగంగాను, తేలికగాను రావచ్చు. అంతరగంగ లో మతపర ప్రాధాన్యత కూడా ఉంది. ఇక్కడకు వచ్చే యాత్రికులు నిరంతర ఈ ప్రవాహాన్ని, పురాతన దేవాలయాన్ని దర్శించవచ్చు. వాస్తవానికి ఈ ప్రవాహం దేవాలయంలో ఒక భాగమైన ఒక రాతి ఎద్దు నోటి వద్ద ఆగిపోతుంది. ఈ ప్రదేశం బెంగుళూరుకు 68 కి.మీ.ల దూరంలో ఉంది. రోడ్డు మార్గం సౌకర్యం కనుక యాత్రికులు అధిక సంఖ్యలో వస్తారు.



Click it and Unblock the Notifications