బెంగళూరు ప్యాలెస్ నగర౦ నడిబొడ్డులోని ప్యాలెస్ గార్డెన్స్ లో ఉంది. ఇది సదాశివనగర్ మరియు జయామహల్ మధ్య ఉంది.ఇంగ్లండ్ లోని విన్సర్ కాసిల్ మాదిరిగా తయారు చేయాలన్న ఉద్దేశ్యం తో ఈ భవన నిర్మాణ ప్రక్రియ రెవ్. గారేట్ చేత 1862 లో ప్రారంభించబడింది. దాన్ని తరువాత 1884 లో వోడేయర్ రాజవంశీకుడైన చామరాజ వోడేయర్ కొనుగోలు చేసారు. 45000 చదరపు అడుగులలో విస్తరించి వున్నఈ రాజభవనం పూర్తి చేసేందుకు 82 ఏళ్ళు పట్టింది. భవనం ముందు వాకిట్లోంచి లోనికి వెళ్తుంటే దాని అందం మిమ్మల్ని ముగ్ధుల్ని చేస్తుంది. ఈ భవనం ఇటీవలే పునరుద్ధరించబడింది.రాజభవనంలోని అంతర్గత నిర్మాణ౦ టూడాన్ నిర్మాణ శైలిని అనుసరించి ఉంటుంది. రాజభవనం దిగువ అంతస్తులో వుండే ప్రాంగణంలో నీలి రంగు సిరామిక్ టైల్స్ పొదిగిన గ్రానైట్ సీట్లు రాత్రి వేళల్లో చూడటానికి చాలా అందంగా వుంటాయి. పై అంతస్తులో రాజుగారు సభ చేసిన విశాలమైన దర్బార్ హాల్ చూడవచ్చు. రాజభవనం లోపలి గోడలు గ్రీక్, డచ్, ప్రఖ్యాత రాజా రవివర్మ చిత్రాల అలంకరణలతో అందాన్ని ఇనుమడింప చేసుకున్నాయి.



Click it and Unblock the Notifications