శివునికి అంకితం చేయబడ్డ ఆరు పురాతన ఆలయాల్లో శ్రీ త్రివతి నాథ్ దేవాలయం ఒకటి. ఇది బరేలి నగర పొలిమేరల్లో ఉన్నది. శివునికి మరో పేరు త్రివతి నాథ్.
పురాణాల ప్రకారం, ఒక గొర్రెల కాపరి యొక్క స్వప్నంలో శివుడు లేదా త్రివాట్ నాథుడు కనిపించి, తను పాన్చల్ ప్రాంతంలో,దట్టమైన అడవిలో మూడు మర్రి చెట్ల కింద ప్రత్యక్షమవుతానని భవిష్య వాణి ద్వారా తెలిపినట్లుగా చెపుతారు. నిజంగానే గొర్రెల కాపరి మర్రి చెట్టు క్రింద నిద్ర పోతున్నప్పుడు అతని కలలో శివలింగం కనిపించింది. లేచి చూడగానే ఆ చెట్ల మొదళ్ళ వొద్ద ఒక శివలింగాన్ని కనుగొన్నాడు.
ఈ సంఘటన హిందూ కాలెండర్ ప్రకారం విక్రమి సంవత్సరం 1474 లొ చోటు చేసుకున్నది. ఈ సమయం ప్రకత్య దివస్ లేదా బాబా ఉద్భవించిన రోజు ఏకకాలంలో సంభవించింది. త్రివేతి నాథ్ భగవాన్ లింగాకారంలో ఉన్నారు.
ఎవరైతే శ్రీ త్రివేతి నాథ్ ను నమ్మకం మరియు భక్తిశ్రద్ధలతో పూజిస్తారో, వారివారి కోరికలు ఫలిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందువలన ఈ దేవాలయానికి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు వొస్తుంటారు.



Click it and Unblock the Notifications