Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కాలన్ గూటే

కాలన్ గూటే  - ఉత్తర గోవా ఆణిముత్యం!

20

కాలన్ గూటే బీచ్ అన్నిటికంటే ప్రధాన ఆకర్షణ. కండోలిం మరియు బాగా బీచ్ ల మధ్యన కల ఈ బీచ్ పర్యాటకులకు స్వర్గం తలపిస్తుంది. ఎన్నో  పార్కింగ్ ప్రదేశాలు. రుసుము చెల్లించి హాయిగా మీ వాహనం రక్షించుకోవచ్చు. బైక్ లేదా కార్ లో వచ్చి ఆనందించవచ్చు. ఇక్కడి దుకాణాలలో దుస్తులు, అనేక ఇతర వస్తువులు, చెప్పులు, గోవా మేగజైన్లు వంటివి ఎన్నో కొనుగోలు చేయవచ్చు. అన్నీ అందుబాటు ధరలలో ఉంటాయి. కాలన్ గూటే లో డ్రైఫ్రూట్లు అధికంగా లభిస్తాయి. నోరూరించే జీడిపప్పు వేపుడు, ప్లెయిన్, సాల్ట్ రుచులలో దొరుకుతుంది. కాలన్ గూటే బీచ్ నీటి క్రీడలకు ప్రసిద్ధి. బీచ్ ప్రవేశిస్తే చాలు అనేకమంది బ్రోకర్లు టికెట్లతో ప్రత్యక్షమవుతారు.

బనానా రైడ్, వాటర్ బైక్ రైడ్, పారాసెయిలింగ్, బోటింగ్ క్రీడలు ఉంటాయి. ఇక్కడనుండి విమానంలో దక్షిణంలో కల కండోలింకు లేదా ఉత్తరంలో కల అంజునాకు తేలికగా చేరవచ్చు. ఇక్కడి హోటల్ సౌజా లోబో ప్రత్యేకమైంది. దీనిలోని పీత ఎండ్రకాయలతో చేసిన వంటకాలు అమోఘ రుచి కలిగి నోరు ఊరేలా ఉంటాయి. మీరు నడిచే వారైతే సమీపంలోని బ్రిట్టోస్ లో తినండి. ఇది బాగా బీచ్ లో ఉంటుంది. నడకలో సుమారు 20 నిమిషాల సమయం పడుతుంది.

కాలన్ గూటే చూసేవారు తాజ్ వివంటా గ్రామాన్ని కూడా చూడాలతి. ఇది ఫోర్ట్ అగౌడా సమీపంలో కలదు. ఈ రిసార్టు నుండి అన్ని బీచ్ లు అంటే కాలన్ గూటే, కండోలిం, బాగా అన్నీ చూడవచ్చు.  కాలన్ గూటే బీచ్ బస్ డిపో కు సమీపంగా అన్ని ప్రదేశాలకు మధ్యగా ఉంటుంది. పాణజిం లేదా ఇతర పర్యాటక స్ధలాలనుండి బస్ లేదా క్యాబ్ లలో చేరవచ్చు. లేదా స్వంత వాహనాలలో రోడ్డుపై ఉంచిన సూచనా బోర్డులు గమనిస్తూ చేరుకోవచ్చు.      

కాలన్ గూటే ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కాలన్ గూటే వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కాలన్ గూటే

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కాలన్ గూటే

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం రోడ్డు ప్రయాణంలో ముంబై - గొవా రహదారి లేదా నేషనల్ హై వే 17 ముంబై నగరాన్ని గోవాకు నేరుగా కలుపుతుంది. రోడ్డు రెండు లేన్లు మాత్రమే కలిగి ఉండి కొద్దిపాటి అసౌకర్యంగా ఉన్నప్పటికి, ఆలస్యం అవుతున్నప్పటికి పర్యాటకులు దీనినే ఇష్టపడతారు. సౌకర్యవంతమైన రోడ్డు ప్రయాణం అంటే, ముంబై నుండి 8 లేన్ల ఎక్స్ ప్రెస్ మార్గంలో పూనే చేరి సతారా హై వే లో సావంత్ వాడి వరకు ప్రయాణించవచ్చు. అక్కడినుండి గోవా కొద్ది నిమిషాలలో చేరుకోవచ్చు. మహారాష్ట్ర లోని ముంబై, పూనే మరియు ఇతర నగరాలనుండి గోవాకు సౌకర్యవంతమైన బస్సులు కలవు. ఓల్వో సెమీ స్లీపర్ బస్సులు సౌకర్యంగా ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం గోవా దేశంలోని ఉత్తర, దక్షిణ మరియు మధ్య ప్రాంతాలకు రైలు సౌకర్యం కలిగి ఉంది. పర్యాటకులు ముంబై నుండి గోవా చేరేందుకు అనుకూలమైన వేళలున్నందున రైలు ప్రయాణం ఎంపిక చేస్తారు. ఒక్క రాత్రి ప్రయాణంలో గోవా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం దక్షిణ గోవాలోని డబోలిం విమానాశ్రయం నుండి ముంబై, ఢిల్లీ మరియు బెంగుళూరు వంటి మహానగరాలకు విమాన సౌకర్యం కలదు. విమానాశ్రయం నుండి క్యాబ్ లు తేలికగా దొరుకుతాయి. డబోలిం అంతర్జాతీయ లేదా కస్టమ్స్ ఎయిరో పోర్టు కాదు కనుక విదేశీ పర్యాటకులు దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు కల ముంబై లేదా ఢిల్లీ ల ద్వారా గోవా చేరాలి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
06 Sep,Sun
Return On
07 Sep,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
06 Sep,Sun
Check Out
07 Sep,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
06 Sep,Sun
Return On
07 Sep,Mon