Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» చందిపూర్

చండిపూర్ – సముద్రం అదృశ్యమయ్యే ప్రదేశం!  

14

చండిపూర్, ఒడిష లోని బలేశ్వర్ జిల్లలో ఉన్న ఒక బీచ్ రిసార్ట్. అక్కడి సముద్ర రకాలలో ఒకటైన ఈ బీచ్ బలేశ్వర్ రైల్వే స్టేషన్ నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక్క క్షణంలో అక్కడి నీరు తగ్గుతుండడం ఆ నీటి స్వభావం, తిరిగి మరో నిమిషం వద్ద బీచ్ మొత్తం నీరు నిండి ఉంటుంది.

అగ్ని, పృథ్వి, ఆకాశం, శౌర్య వంటి క్షిపనులు ఉన్న ప్రసిద్ధ మిసైల్ టెస్టింగ్ ప్రారంభం కూడా ఇక్కడే జరిగింది. ఇక్కడి అధికారుల నుండి ప్రత్యెక అనుమతి తీసుకొనడం ద్వారా ఈ టెస్టింగ్ శ్రేణిని సందర్శించవచ్చు. ఇక్కడ సందర్శకుల సౌకర్యార్ధం అద్భుతమైన విలాసవంతమైన, సౌకర్యవంతమైన అనేక హోటల్లు కూడా ఈ బీచ్ పక్కన నిర్మించబడ్డాయి.

చండిపూర్ లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

చండిపూర్ పర్యాటకం సమీపంలోని పర్యాటక ఆకర్షణల వల్ల అదనపు ప్రయోజనాన్ని పొందింది. రాతి, పచ్చని నీలగిరి కొండలు, పవిత్ర పంచలింగేశ్వర్, రేమునా లోని పవిత్ర ఖిర్చోర గోపీనాథ్ ఆలయం చండిపూర్ పర్యటనలో ప్రధాన ఆకర్షణలు. ప్రస్తుతం ఇది చండిపూర్ నుండి సుదూర ప్రాంతంలో ఉన్నప్పటికీ, సజనగడ్ అనే ఏకాంత గ్రామం, భితర్కనిక వద్ద ఉన్న వన్యప్రాణుల అభయారణ్యం ప్రయాణీకులకు గమ్య స్థానాలుగా ఉన్నాయి.

చండిపూర్ లోని వంటకాలు

చండిపూర్ సముద్ర ఆహారానికి ప్రసిద్ది చెందింది. చండిపూర్ లోని హోటల్స్ లో నూరూరించే వంటకాలైన రొయ్యల వంటకాన్ని పర్యాటకులు అస్సలు మిస్ కావద్దు. అంతేకాకుండా, చండిపూర్ లోని పెదాలను తడిపే స్వీట్లను ప్రయత్నించడం మర్చిపోవచ్చు.

చండిపూర్ కి ప్రయాణం

చండిపూర్ చేరుకోవడం ఎలా

చండిపూర్ ను బలేశ్వర్ రైల్వే స్టేషన్ నుండి రైలులో బోర్డింగ్ చేసి, అక్కడి నుండి టాక్సీలు, ఆటో రిక్షాల ద్వారా చండిపూర్ చేరుకోవచ్చు.

చండిపూర్ వాతావరణం

శీతాకాల సమయంలో చండిపూర్ పర్యటన ఉత్తమం, ఈ బీచ్ ద్వారా వచ్చే చల్లని గాలులు ప్రతి ఒక్కరినీ ప్రపంచ అంతిమ ఓదార్పుకు తీసుకు వెళతాయి.

భ్రమని, వైతరణి, దామర నదుల డెల్టా వద్ద ఉన్న భితర్కనిక చండిపూర్ నుండి 151.3 కిలోమీటర్ల దూరంలో ఉంది. అన్యదేశ వన్యప్రాణులు, దట్టమైన పచ్చని అడవులతో ఉన్న ఈ భితర్కనిక వేసవి, శీతాకాల సమయంలో పర్యాటకుల ప్రవాహాన్ని చూస్తుంది. సందర్శకులు దీని ప్రవేశానికి భితర్కనిక అటవీ శాఖ వారి నుండి అనుమతి తీసుకుంటారు. ఇక్కడికి చేరుకోవడానికి కమ్యూనికేషన్ కు ఉపయోగపడే సాధనం ఖోలా నుండి దంగ్మల్ వరకు బోట్ రైడ్ మాత్రమే. ఈ ఆకర్షణీయమైన పడవ రైడింగ్ భారతదేశంలో అతిపెద్ద మడ అడవుల పర్యావరణ వ్యవస్థకు సాక్ష్యాలుగా చెప్పవచ్చు.

భితర్కనిక లో ఉన్న నేషనల్ పార్కు వన్యప్రాణుల అభయారణ్యం చే ఆవరించి ఉంది. దీనికి సమీపంలో అడవి, బంగాళాఖాతం మధ్యలో విభజించడానికి పనిచేసే గహిరా మాత బీచ్ ఉంది. వృక్ష, జంతు జాలాలు సమృద్ధిగా ఉన్న ఈ భితర్కనిక తెల్లని మొసలి, ఉప్పునీటి మొసళ్ళు, పర్యవేక్షించే బల్లులు, పైతాన్లు, కింగ్ కోబ్రా, డార్తర్స్ ఇంకా అనేకం వంటి అద్భుతమైన, అంతరించిపోతున్న జంతు జాతులకు నిలయం. ఇక్కడి సెంట్రల్ ఏసియా నుండి, యూరోప్ వలస పక్షులు పర్యటనకు అదనపు ప్రయోజనాన్ని సృష్టిస్తాయి.

చండిపూర్ బీచ్, చండిపూర్ లోని ఆకర్షణీయ ప్రదేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఈ మానవాతీత బీచ్ ప్రకృతి అద్భుతాలలో ఒకటి. కొన్ని నిమిషాలలోనే ఈ నీరు తగ్గుముఖం పట్టడం ఈ నీటి అద్భుతమైన దృగ్విషయం, మళ్ళీ కొన్ని నిమిషాలలోనే జతల అలలను ఎదుర్కుంటుంది. ఒక నిర్దిష్ట విరామ సమయంలో అధిక, తక్కువ అలల కారణంగా ఇలా రోజుకు రెండుసార్లు జరుగుతుంది. ఆటుపోట్లు తక్కువగా ఉన్నపుడు నీరు ముందుకు వస్తుంది, అధికంగా ఉన్నపుడు తిరిగి వెనక్కు వెళ్తుంది.

ఈ బీచ్ లో కనిపించే ఇసుక దిబ్బలు, పచ్చని కాసువరినా చెట్లు ఈ బీచ్ అద్భుతమైన అందానికి మరింత ఆకర్షణీయతను జోడించాయి. ఈ బీచ్ లో ఎరుపు ఎండ్రకాయలు, గుర్రం-పాదాల పీతల నివాసాలు ఉన్నాయి.

చందిపూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

చందిపూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం చందిపూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? చందిపూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా వెస్ట్ బెంగాల్, ఒడిష లోని అన్ని ప్రధాన నగరాల నుండి చండిపూర్ కు బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. తూర్పు భారతంలో దీని ప్రాముఖ్యం వల్ల, బస్సులు, టాక్సీలలో చాలా పాకేజ్ టూర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి రోడ్లు చాలా బాగా ఉండడం వల్ల ప్రయాణం కూడా హాయిగా సాగుతుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా *చండిపూర్ లో రైల్వే స్టేషన్ లేదు చండిపూర్ కి బలేశ్వర్ సమీప రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ దేశంలోని అన్ని ప్రధాన రైలు జంక్షన్ లకి బాగా అనుసంధానించబడి ఉంది. అందువల్ల ప్రజలు, దేశంలోని అన్ని ప్రాంతాల నుండి బలేశ్వర్ రైల్వే స్టేషన్ కి రావచ్చు, తరువాత 40 నిమిషాల ప్రయాణంతో చండిపూర్ చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనేశ్వర్, చండిపూర్ కి సమీప విమానాశ్రయం. కొలకత్తా లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా చండిపూర్ చేరుకోవచ్చు. ఇది 314 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రెండు ప్రదేశాల నుండి టాక్సీలు, రోజువారీ బస్సులు అందుబాటులో ఉన్నాయి, ఇవి చండిపూర్ కి నేరుగా వెళతాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue