మీరా దేవాలయం, రాజపుత్ర యువరాణి మీరాబాయికు చెందినది. ఆమె రాచరికజీవితపు అన్ని విలాసాలను వీడి, తన జీవితమంతా కృష్ణుని పూజిస్తూ గడిపింది. కృష్ణుని స్తుతిస్తూ భజనలు, పాటలు పాడుతూ మీరాబాయి జీవితాన్ని గడిపింది.మీరా దేవాలయం రాజపుత్రుల నిర్మాణశైలి కి ఒక అద్భుతమైన మచ్చుతునక. ఇది కుంభ శ్యామ దేవాలయానికి దగ్గరలో ఉంది. ఈ దేవాలయాన్ని ఉత్తర భారతదేశశైలి లో నిర్మించారు. ఈ దేవాలయాన్ని చుట్టి ఉన్న వసారాలో నాలుగు వేదికలు ఉన్నాయి. మీరా, కృష్ణుల అనేక అందమైన, సజీవ చిత్రాలతో ఈ దేవాలయ లోపలి గోడలు అలంకరించబడ్డాయి.



Click it and Unblock the Notifications