పద్మిని ప్యాలెస్, సౌందర్యవతి, ధైర్యవంతురాలు రాణి పద్మిని నివాసం. గొప్ప చిత్తోర్ ఘడ్ కోట లో ఉన్నఈ భవనం రాణి పద్మిని ధైర్యాన్ని, అందాన్ని వర్ణిస్తుంది.తామరలు, కాలువలు ఉన్న ఒక కొలను ఈ భవనం సమీపంలో ఉంది. ఈ ప్రాంతంలోనే సుల్తాన్ అల్లాఉద్దీన్ ఖిల్జీ అందమైన రాణి పద్మిని ప్రతిబింబం చూసాడని భావిస్తారు. ఆమె శాశ్వత అందానికి ముగ్దుడైన సుల్తాన్ కు రాణి పై కల్గిన కోరిక యుద్ధానికి దారి తీసింది.ఈ భవనం అద్భుతమైన నిర్మాణ శైలి, పరిసరాల రమణీయత దీని లావణ్యాన్ని పెంచుతాయి. ఇక్కడకు దగ్గరలో నీలకంఠ మహాదేవ శివాలయం ఉంది.



Click it and Unblock the Notifications