హిందువుల పవిత్ర స్ధలం. కావేరి దాని ఉపనది కన్నికె సంగమంలో కలదు. సుజ్యోతి నది ఇక్కడే భూమిలోపల కలుస్తుంది. దీనినే త్రివేణి సంగమం అంటారు. తులా సంక్రమణంలో యాత్రికులు ఇక్కడ స్నానాలు ఆచరిస్తారు. ఇక్కడే శ్రీ భగంధేశ్వర దేవాలయం కలదు. దీనిలో భగంధేశ్వరుడు, సుబ్రమణ్య, మహా విష్ణు మరియు గణపతి విగ్రహాలు కలవు. దీనిని భగంధేశ్వర క్షేత్రం అని కూడా అంటారు.
ఈ దేవాలయాలు కేరళ శిల్ప శైలిలో నిర్మాణం చేశారు. ఒకప్పుడు దీనిని టిప్పు సుల్తాన్ ఆక్రమించుకోగా తర్వాతి కాలంలో దొడ్డ వీర రాజేంద్ర మరోమారు దీనిపై ఆధిపత్యం పొంది స్వతంత్ర కొడగు రాజ్యాన్ని స్ధాపించటంతో భాగమండల పూర్వపు శోభ సంతరించుకొంది. భాగ మండల మడికెరి నుండి 33 కి.మీ.లు ఉంటుంది. విరాజ్ పేటకు రోడ్డు ద్వారా అనుసంధానించబడింది.



Click it and Unblock the Notifications