దారిబా కలాన్ అనేది డిల్లీలో మార్కెట్లకు ప్రసిద్ది గాంచిన ఒక వీధి. ఈ మార్కెట్ లో విలువైన రాళ్ళు, రత్నాలు, బంగారం, వెండి ఆభరణాలను విక్రయిస్తారు. ఈ మార్కెట్ ఇప్పుడు వెండి, వస్త్రాభరణాలకు పేరుగాంచినా దీనిని ఇప్పటికీ ఆభరణాల వీధి అనే అంటారు. ఆభరణాలు అమ్మే దుకాణాలే కాకుండా, ప్రామాణికమైన అత్తరు, ఒక రకమైన పన్నీరు విక్రయించే దుకాణాలు కూడా ఉన్నాయి.
చాందిని చౌక్ లోని దారిబా కలాన్ అంటే అక్షరాల “సాటిలేని పెరల్ వీధి” అని అర్ధం. షాజహాన్ చక్రవర్తి పరిపాలనా సమయలో ఈ మార్కెట్ కి ప్రాముఖ్యత వచ్చింది.
ఈ వీధి మాత్రమే కాకుండా, ఇక్కడ కొన్ని విలువైన షాపింగ్ ప్రాంతాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని సరోజినీ నగర్, ఖారి బావోలి, ప్రగతి మైదాన్, లజ్ పత్ నగర్, ఖాన్ మార్కెట్ ఉన్నాయి. ఈ వీధికి దగ్గరలోని ఇండియా గేట్, ఎర్ర కోట, జమ మసీదు, జంతర్ మంతర్ ఇతర ఆకర్షణలు.



Click it and Unblock the Notifications