Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఢిల్లీ » ఆకర్షణలు » హాజ్ ఖాస్ ప్రాంగణం

హాజ్ ఖాస్ ప్రాంగణం, ఢిల్లీ

4

దక్షిణ ఢిల్లీలో ఉన్న హాజ్ ఖాస్ ప్రాంగణం స్మారక చిహ్నాలకు నిల్వ ప్రదేశం. ప్రస్తుతం ఈ ప్రాంగణం ఒక సమాధి, ఇస్లామిక్ శిక్షణ కేంద్రం, ఒక మసీదు, నీళ్ళ టాంక్, మధ్యయుగ చరిత్రతో పట్టణీకరణ చెందిన గ్రామం చుట్టూ అనేక మంటపాల వంటి ఆశక్తికర ఆకర్షణలను కలిగి ఉంది. హాజ్ ఖాస్ అల్లావుద్దీన్ ఖిల్జీ వంశంలోని రెండవ మధ్యయుగ నగరమైన సిరి లో ఒక భాగంగా ఉపయోగించబడింది. ప్రస్తుతం, ఇది సఫడుర్జింగ్ అభివృద్ది ప్రాంతంగా జింకల పార్కుకు దగ్గరగా ఉంది. ఇది రోడ్డు, రైలు మార్గాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉండడం వల్ల చాలా ఆశక్తికర పర్యాటక ఆకర్షణగా తయారైంది. అంతేకాకుండా, హుజ్ ఖాస్ పరిసరాలు అందమైన భారతీయ సాంప్రదాయ దుస్తులు అమ్మకానికి ప్రసిద్ది చెందిన గొప్ప దుకాణాలను కలిగి ఉంది.

ఇందులోని స్మారక చిహ్నాల గురించి కొద్దిగా: హాజ్ ఖాస్ లేదా ‘రాయల్ టాంక్’: హాజ్ ఖాస్ అంటే ‘రాయల్ టాంక్’ అనే పెద్ద పదం. ఇది హాజ్ ఖాస్ ప్రాంగణంలోని స్మారక చిహ్నాలలో ఒకటి. సిరి నగరంలో అల్లాఉద్దీన్ ఖిల్జీ పరిపాలనా సమయంలో తవ్వకాలలో బైటపడిన ఈ నీళ్ళ టాంక్ ఈ నగర అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోటలోపల ఏర్పాటు చేయబడింది. అయితే ఆ సమయంలో ఉపయోగించక వదిలి వేయడంవల్ల ఎండిపోయింది, ఇటీవల ఇది పునరుద్ధరించబడింది, ఈ టాంక్ దాని పరిసరాలు జాగార్లకు, వాకర్లకు నడక మార్గంగా, అందమైన పార్కుతో అందంగా అలంకరించబడి నిర్వహించబడుతుంది.

మద్రాసు/ఇస్లామిక్ శిక్షణ సంస్థ: 1352 లో ఏర్పాటుచేయబడిన ఈ సంస్థ ఢిల్లీ సుల్తానుల ప్రముఖ విద్య సంస్థలలో ఒకటి. ఇది అతిపెద్ద ప్రత్యెక అర్హతని పొందడమే కాక, ప్రపంచంలో మదరసాలను కలిగి ఉన్న ఉత్తమమైన వాటిలో ఒకటి.

ఫెరోజ్ షాహ్ సమాధి: తుగ్లక్ వంశంలో మూడవ పాలకుడైన ఫెరోజ్ షాహ్ సమాధి హాజ్ ఖాస్ ప్రాంగణంలోనే ఉండడం మరో ప్రధాన ఆకర్షణ. ఇండో-ఇస్లామిక్ నిర్మాణ శైలితో నిర్మించబడిన ఈ సమాధి క్రీశ. 1352, 1354 సమయంలో పూర్తిచేయబడింది, ఇది ఈ భవనంలోనే చారిత్రిక ప్రాముఖ్యత కలిగిన ఒక ప్రముఖ నిర్మాణంగా ఉంది. ఈ భావన నిర్మాణం లోపల ఫెరోజ్ షాహ్, అతని కుమారుడు, మనుమడి సమాధులు ఉన్నాయి.

జింకల పార్కు: ఇది టాంక్ కు సమీపంలో ప్రాంగణ ప్రవేశ ద్వారం వద్ద సందర్శకుల కోసం కొత్తగా అభివృద్ది పరచిన పార్కు. అందంగా నిర్వహించబడే ఈ పార్కులో మచ్చల జింకలు, సీమపందులు, కుందేళ్ళు, నెమళ్ళు ఉన్నాయి.

ప్రతిరోజూ సాయంత్రం, పర్యాటక శాఖ హాజ్ ఖాస్ ల చరిత్రను వివరించే శబ్ద, కాంతి ప్రదర్శనను నిర్వహిస్తుంది. ఈ ప్రాంగణం సందర్శకుల కోసం ప్రతిరోజూ ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరవబడి ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu