Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఢిల్లీ » ఆకర్షణలు » ఖూని దర్వాజా

ఖూని దర్వాజా, ఢిల్లీ

3

ఖూని దర్వాజా (రక్తపు మరకల ద్వారం) – దీనికి ఆసక్తికరమైన పేరు లాగే ఆసక్తికర పురాణగాథలు ఉన్నాయి. ఖూని దర్వాజా, ఢిల్లీ గేట్ దగ్గరలో బహదూర్ షా జాఫర్ మార్గంలో ఉన్న ఒక ద్వారం. ముస్లిం సూర్ రాజ్యస్థాపకుడు షేర్ షా సూరి నిర్మించిన ఈ ద్వారం అతనే నిర్మించిన ఫిరోజాబాద్ కు దారి తీసే ద్వారాల్లో ఒకటి, ఆఫ్ఘనిస్తాన్ నుండి ఈ ద్వారం గుండా వచ్చే ప్రజలలో కాబూలి బజార్ గా కూడా ఈ ద్వారం ప్రసిద్ది చెందింది15.5  మీటర్ల ఎత్తైన ఈ ద్వారాన్ని ఢిల్లీ స్పటిక శిలలతో నిర్మించారు. ఖూని దర్వాజా లోని  వివిధ స్థాయిలను లోపల ఉన్న మూడు మెట్ల ద్వారలగుండా చేరవచ్చు.

ఈ ద్వార౦  బ్రిటిష్ నాయకుడు విలియం హడ్సన్ ఈ ద్వారం వద్ద హత్య చేసిన ముగ్గురు మొఘల్ వంశపు యువరాజులు మీర్జా మొఘల్, ఖిజర్ సుల్తాన్ – బహదూర్ షా జాఫర్ కుమారులు, అతని మనవడు మీర్జా అబూ బకర్ల పేరు పొందింది,  తర్వాత రాజు సెప్టెంబర్ 22, 1857న బ్రిటిష్ వారికి లొంగి పోయాడు. అయితే, ఖూని దర్వాజాకు సంబంధించి ఇంకా అనేక పురాణగాధలు ఉన్నాయి, ఇవి ఈ ద్వారం ఎందుకా పేరు పొంది ఉండొచ్చో తెలియ చేస్తాయి.

ఇవిగో కొన్ని ఉదాహరణలు : అక్బర్ కుమారుడు జహంగీర్ అక్బర్ నవరత్నాలలో ఒకరు అబ్దుల్ రహీం ఖాన్ – ఏ – ఖానా కుమారులను చంపి దేహాలను ఈ ద్వారానికి వేలాడ దీసి, కుళ్ళి పోయేదాకా వదిలి వేసాడు. అక్బర్ తర్వాత జహంగీర్ సింహాసనం అధిష్టించడానికి వ్యతిరేకంగా అబ్దుల్ రహీం కుట్ర పన్నినందున చేశాడని అంటారు.

ఔరంగజేబు తన అన్న దారా షికో ను సింహాసనం కోసం పోరాడుతూ ఓడించి అతని తలను ద్వారం వద్ద వేలాడదీసి ప్రదర్శించాడని అంటారు.

పర్షియాకు చెందిన నాదిర్ షా ఢిల్లీ ను కొల్లగొట్టి నప్పుడు కూడా 1739వ సంవత్సరంలో ఈ ద్వారం వద్ద రక్తపాతం జరిగిందని అంటారు.

స్వాతంత్రం తర్వాత కూడా, 1947 అల్లర్ల సందర్భంగా ఖూని దర్వాజా వద్ద కొంత రక్త పాతం జరిగిందని అంటారు. పురానా ఖిలా వద్ద ఉన్న శిబిరానికి వెళ్తున్న అనేక మంది శరణార్థులు ఈ ప్రాంతంలో మరణించారు. ప్రస్తుతం, ఈ ద్వారం ఏ ఎస్ ఐ చారిత్రిక సంరక్షణ ప్రదేశం. అయితే, ఇది మూసి వేయబడింది, 2002 వ సంవత్సరంలో ఈ ద్వారం వద్ద జరిగిన ఒక అవాంచిత సంఘటన వలన ప్రజలకు ఈ ద్వార ప్రవేశాన్ని నిషేధించారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed