పశ్చిమ ఢిల్లీ కుతుబ్ కాంప్లెక్స్ కి దగ్గరలో గల మెహ్రౌలి ఆర్కియలాజికల్ పార్క్ ప్రపంచం లోనే ఎక్కువ స్మారక చిహ్నాలున్న ప్రదేశం గా ప్రసిద్ధి. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ పార్కు దశాబ్దం క్రితం మనకి అందుబాటులో ఉండేది కాదు.
100 ఎకరాల ఈ సువిశాల ప్రాంగణం లో స్మారక చిహ్నాలే కాకుండా మశీదులు,సమాధులు మరియు పేరు తెలియని అనేక ఉద్యానవనాలు ఉన్నాయి. 1266 నుండీ 1287 వరకూ ఢిల్లీ ని పరిపాలించిన "ఘియస్-ఉద్-దిన్ బాలబన్" గౌరవార్ధం నిర్మించబడ్డ "బాలబన్ సమాధి" ఇక్కడ ఉంది. భారత దేశంలో విల్లు వంటి వంపుతో కట్టబడిన మొట్టమొదటి కట్టడంగా ఈ సమాధి గుర్తించబడినది. ఇక్కడే ఉన్న "జమాలి-కమాలి" మశీదు కట్టడానికి కూడ ఒక చరిత్ర ఉంది. సికంధర్ లోఢీ,హుమాయున్ ల కాలం నాటి కవి మరియు సన్యాసి అయిన "జలాల్ ఖాన్" పేరు మీద ఈ మశీదు నిర్మించబడినది. ఇక్కడే ఉన్న "కమలి సమాధి" చరిత్ర పెద్దగా ఎవరికీ తెలియదు.
ఇక్కడే ఉన్న మెట్ కాఫ్ మంటపం, మెట్ కాఫ్ బోట్ హవుస్,కులీఖాన్ సమాధి,మెత్ఖాఫ్ గెస్ట్ హవుస్, రాజన్ కి బాఉలీ,గంధక్ కీ బాఉలీ, మౌలానా మజ్దుద్దీన్ సమాధి,ఖాన్ షాహిద్ సమాధి,ఆధం ఖాన్ సమాధులు చరిత్ర కారులకి అంతగా ప్రసిద్ధి చెందని ఇతర స్మారక చిహ్నాలు.
నగర రణగొణధ్వనులకి దూరంగా ప్రశాంత వాతావరణంలో మనకు ప్రియమైన వారితో గడాపలనుకునే వారికి మెహ్రౌలీ ఆర్కియలాజికల్ పార్క్ మంచి ప్రదేశం.



Click it and Unblock the Notifications