ఢిల్లీ లోని సఫ్దర్ జంగ్ సమాధి ని 1753 సంవత్సరం లో నవాబ్ ఆఫ్ అవధ, షియా ఉద్ దులా తన తండ్రి సఫ్దర్ జంగ్ జ్ఞాపకార్ధం నిర్మించారు. మొగలాయి శిల్ప తీరు లో నిర్మించిన చివరి నిర్మాణం ఇది.
౩౦౦ చ. కి. మీ. ల విస్తీర్ణం లో నిర్మించిన ఈ చారిత్రక స్మారక ప్రవేశం ఎర్రటి రాయి తో కట్టబడి చాలా ఆకర్షనీయం గా వుంటుంది. సమాధి లోని సెంట్రల్ ఆర్చ్ వివిధ రంగుల తో ఆకర్షణీయంగా వుంటుంది. తొమ్మిది చిన్న బురుజులు తెల్లటి సెంట్రల్ గోపురాన్ని తాకుతూంటాయి. ఇదంతా మొగలాయి సామ్రాజ్య వైభవానికి చిహ్నంగా వుంటుంది.
దీనిలో అతి పెద్ద గోడలు, పొడవైన ఫౌంటెన్ లు, మొగలాయి తోటలు వంటివి కలిగి పర్యాటకులకు ఆనందం కలిగిస్తాయి. ఇక్కడ మోతీ మహల్, జంగ్లి మహల్, బాద్ షా పసంద్ అనే ప్రత్యేక పేర్ల తో కొన్ని మంటపాలు కూడా కలవు.
సఫ్దర్ జంగ్ సమాధి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు అన్ని రోజుల్లోనూ తెరచే వుంటుంది.



Click it and Unblock the Notifications