టాయ్ లెట్ల మ్యూజియం గురించి విన్నారా ? ఢిల్లీ లో ఈ మ్యూజియం ఒకటి కలదు. ఈ మ్యూజియం ను సులభ్ ఇంటర్ నేషనల్ వారు నిర్వహిస్తారు. టాయ్ లెట్ల చరిత్రను వివరిస్తూ, ప్రజలలో వాటిపై ఒక అవగాహన కలిగించట మే దీని ఉద్దేశ్యం.
ఆది నుండి నేటి వరకు టాయ్ లెట్లు ఎలా అభివృద్ధి చెందాయనేది చిత్రాలు మరియు ఇతర సామాగ్రి తో వివరిస్తారు. సుమారు క్రి. పూ. 2500 సంవత్సరం నుండి నేటి ఆధునిక టాయ్ లెట్ల వరకు ఇక్కడ కలవు.
ఈ మ్యూజియం ను డా. బిందేశ్వర్ పథక్ కనుగొన్నారు. పరిశుభ్రత, పారిశుధ్యం ల పట్ల అవగాహన కలిగించితమే వీరి లక్ష్యం గా కలదు. ఆదివారాలు తప్ప మిగిలిన రోజులలో ఉదయం 10.30 గం. నుండి సా.5.30 గం వరకు తెరచి వుంటుంది. ఎంట్రీ ఫీసు లేదు.



Click it and Unblock the Notifications