ఢిల్లీ లోని సున్హేరి మసీద్ చాంద్ ని చౌక్ లోని సిస్ గంజ్ సాహబ్ గురుద్వారా వద్ద కలదు. ఈ మసీదు ని రోషన్ ఉద్ దౌలా జఫ్ఫార్ ఖాన్ 1721 లో మహమ్మద్ షా పాలనలో నిర్మించారు. దీనినే గోల్డెన్ మాస్క్ అని కూడా అంటారు. ఈ మాస్క్ కు మూడు ఉల్లిపాయ ఆకారం లో రాగి తో చేయబడిన డోమ్ లు వుంటాయి. ఒకప్పుడు ఇవి బంగారం లా మెరిసి పోతూ బంగారు మసీద్ అని పిలిచే లా చేసేవి.
అయితే, ఇదే పేరు తో రెడ్ ఫోర్ట్ యొక్క ఢిల్లీ గేటు నైరుతి మూలలో మరొక మసీదు కూడా కలదు. ఇది కూడా చాంద్ ని చౌక్ లోని నేతాజీ సుభాష్ పార్క్ కు ఎదురుగా ఉండడంచే తరచుగా దీనినే సున్హేరి చౌక్ గా భావిస్తారు.
మసీదు కు దగ్గరగా, రెడ్ ఫోర్ట్, జామా మసీద్, గురుద్వారా సిస్ గంజ్ సాహిబ్, మొదలైన ఆకర్షణలు కలవు.



Click it and Unblock the Notifications