ఢిల్లీ లోని తుగ్లకాబాద్ కోట శిధిలమై వుంది. దీనిని 1321 సంవత్సరం లో తుగ్లక్ వంశ స్థాపకుడైన గియాస్ ఉద్ దిన్ తుగ్లక్ నిర్మించారు. ఈ కోట నిర్మాణం వెనుక ఆసక్తి కర కధ కలదు. గియాస్ ఉద్ దిన్ తుగ్లక్ గా చెప్పబడే ఘాజి మాలిక్ ఢిల్లీ ని పాలించిన ఖిల్జీ రాజులకు భూస్వామి గా ఉండేవాడు. ఒక రాజు గాజి మాలిక్ ను నీవు రాజు అయినపుడు, ఒక కోట నిర్మించు...అని అవహేళన చేసినందుకు గాను, పట్టుదలతో తుగ్లక్ ఈ కోటను నిర్మించాడు. తర్వాతి కాలం లో తాను రాజు అయి ఖిల్జీ పాలకు లను ఢిల్లీ నుండి తరిమి వేశాడు.
కోట ను మరింత సుందరం గా తయారు చేయటానికి ప్రయత్నించాడు కాని ఆయనకు గల ఒక రుషి శాపం కారణంగా కోరుకున్న విధంగా చేయలేక పోయాడు. ఢిల్లీ లో ఈ కోట చాలా పెద్దది. దీనిలో అందమైన, మసీదులు, భవనాలు, టవర్లు, భవనాలు, సరస్సులు కలవు. కోట గోడలు ఇతర కోతల గోడల కంటే మందంగా వుండి చాలా బలంగా వుంటాయి. కోటల తో నిండిన, శిధిలమైన తుగ్లకాబాద్ ఢిల్లీ లో మూడవ నగరం. అయినప్పటికీ చక్కని రోడ్లు, ఇతర వసతులు ప్రణాళికా బద్ధంగా వుంటాయి. ఈ కోట కుతుబ్ కాంప్లెక్స్ కు సమీపం లో వుంటుంది.



Click it and Unblock the Notifications