Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» దీమాపూర్

దీమాపూర్ – గొప్ప నదీ తీరాన వున్న నగరం !

ఈశాన్య భారతంలో వేగంగా ఎదుగుతున్న నగరంగా పరిగణించ బడే దీమాపూర్, నాగాలాండ్ కు ప్రవేశ ద్వారం కూడా. ఒకప్పుడు ఒక రాజ్యానికి రాజధానిగా వెలిగిన ఈ నగరం, ఇప్పుడు రాష్ట్ర రాజధాని కాకపోయినప్పటికీ అంతే స్థాయిలో మౌలిక వసతులు సదుపాయాలూ కలిగి వుంది. దిమాసా అనే పదం నుంచి దీమాపూర్ అనే పేరు వచ్చింది – దీ అంటే నీరు, మా అంటే పెద్ద లేక గొప్ప, పూర్ అంటే నగరం అని అర్ధం. అలా, దీమాపూర్ అంటే ఒక గొప్ప నదీ తీరాన వున్న నగరం అని అర్ధం. ధనసిరి నది ఈ నగరం గుండా ప్రవహిస్తుంది.

30

దీమాపూర్ నగరానికి గొప్ప చరిత్ర వుంది, ఒకప్పుడు కచారి వంశీయులు ఏలిన దిమాసా రాజ్యానికి ఇది రాజధానిగా వుండేది. దీమాపూర్ చుట్టూ వుండే పురావస్తు శిధిలాల ఆధారంగా ఈ నగరాన్ని బాగా కాపాడుతూ కూడా వుండే వారని తెలుస్తుంది. దిమాసా రాజధాని దగ్గరలోని మైదానా ప్రాంతాలకు కూడా విస్తరించేది, ఇప్పటి ఎగువ అస్సాం దాకా. కొన్ని దేవాలయాలు, తీరాలు, చెరువు కట్టల వెంట ఈ ప్రాచీన నగరపు ఆనవాళ్ళు వున్నాయి. ఈ చారిత్రిక అవశేషాలు దిమాసాస్ ప్రాంతంలో హిందూత్వ ప్రధానంగా పాటించేవారని తెలియచేస్తాయి. అయితే దిమాసాలు ఆర్యులు కారనీ, ప్రాచీన గిరిజన తెగలవారని, ఈ ప్రాంతంలో ఎక్కువ భాగాన్ని ఏలారని భావిస్తారు.

ఆధునిక చరిత్రలో కూడా, రెండో ప్రపంచ యుద్ధం కాలంలో జపాన్ కు, బ్రిటిష్ ఇండియాకు మధ్య జరిగిన యుద్ధంలో కూడా దీమాపూర్ కీలక పాత్ర పోషించింది. జపనీయులు దీమాపూర్ గుండా తెచ్చుకున్న బలగాల వల్లనే కొహిమా మీద దాడి జరిగిందంటారు.

దీమా పూర్ ను చాలా మంది చరిత్రకారులు ‘ఇటుకల నగరం’ అని వ్యవహరిస్తారు.

పర్యాటకుడి కోసం కొంత భౌగోళిక సమాచారం

ఇప్పటి దీమాపూర్ భౌగోళికంగా నాగాలాండ్ లోని పశ్చిమ అంచున, ఆగ్నేయం లో కొహిమా జిల్లా, పడమట (అస్సాం లోని) కార్బి అంగ్లోంగ్ జిల్లా, ఉత్తరాన (అస్సాం లోని) గోలాఘాట్ జిల్లా మధ్య వుంది. రాష్ట్రంలో రైలు, విమాన సౌకర్యాలు వున్న ఏకైక నగరం దీమాపూర్.

నాగాలాండ్ కు, తత్ఫలితంగా మణిపూర్ కు కూడా దిమాపూర్ ఈశాన్య భాగాన కీలక ప్రాంతం. 39 వ నెంబర్ జాతీయ రహదారి కొహిమా, ఇంఫాల్ లను దేశంలోని ఇతర ప్రాంతాలకు కలుపుతు౦ది. మయన్మార్ తో వుండే మోరే సరిహద్దు కూడా దిమాపూర్ గుండా వెళ్తుంది.

పర్యాటకులకు ఆసక్తి కలిగించే కళా, సాంస్కృతిక అంశాలు

నాగాలాండ్ చేనేత చాలా ప్రసిద్ది పొందింది, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. దిమాపూర్ లో ఇప్పటికీ ప్రపంచంలోని అతిపెద్ద చేనేత పరిశ్రమ వుంది, ఇక్కడి నుంచి నాగా శాలువాలు, ఇతర కళాకృతులు దేశంలోని ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతూ వుంటాయి. ఈ ప్రాంతంలోని గొప్ప కళా, సంస్కృతులను అభివృద్ది చేయడానికి ప్రభుత్వం ఈశాన్య మండల సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ నాగాలాండ్ కళాకృతులను ఒక మ్యూజియంలో భద్రపరచి, ఈ కేంద్రం వారు నిత్యం సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తారు.

ఇన్నర్ లైన్ పర్మిట్

నాగాలాండ్ లోని ఇతర ప్రాంతాలన్నీ రక్షిత ప్రాంతాల చట్టం పరిధి లోకి వస్తాయి కానీ దీమాపూర్ ఈ పరిధిలో లేదు. అందువల్ల పర్యాటకులు దీమాపూర్ చూడాలంటే ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకోవక్కర్లేదు. అయితే, ఇన్నర్ లైన్ పర్మిట్ అవసరం లేకపోయినప్పటికీ, పర్యాటకులు సంరక్షిత ప్రాంత పర్మిట్ తీసుకుంటే గానీ నగరం బయటకు వెళ్ళకూడదు. సంరక్షిత ప్రాంత పర్మిట్ తీసుకోవడం చాలా తేలిక, నేరుగా డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి ఈ పర్మిట్ తెచ్చుకోవచ్చు. ఈ పర్మిట్ ను ఈ క్రింది కార్యాలయాల నుంచి కూడా పొందవచ్చు.

* డిప్యూటి రెసిడెంట్ కమిషనర్, నాగాలాండ్ హౌస్, న్యూ డిల్లీ

• డిప్యూటీ రెసిడెంట్ కమిషనర్, నాగాలాండ్ హౌస్, కోల్కతా

• అసిస్టెంట్ రెసిడెంట్ కమిషనర్, గువహతి, షిల్లాంగ్

• డిప్యూటీ కమిషనర్ దీమాపూర్, కొహిమా, మోకోక్చుంగ్,

దీమాపూర్ లో పర్యాటక ఆకర్షణలు

ఒక గొప్ప చారిత్రిక నేపథ్యంతో ఈశాన్యంలోని ఒక ముఖ్య నగరం కావడం వల్ల దీమా పూర్ లో పర్యాటక కేంద్రాలు చాలానే వున్నాయి.

దీమాపూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

దీమాపూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం దీమాపూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? దీమాపూర్

  • రోడ్డు ప్రయాణం
    దిమాపూర్ కు రెండు జాతీయ రహదారులు కలుస్తాయి. ఇక్కడ నుండి నేరుగా నాగాలాండ్ రాజధాని కొహిమ కు బస్సు లు కలవు. అన్ని ప్రధాన నగరాలనుండి ప్రభుత్వ బస్సు లు కూడా నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    నాగాలాండ్ రాష్ట్రం మొత్తానికి రైలు స్టేషన్ దిమాపూర్ లోనే కలదు. ఇక్కడ నుండి అన్నిప్రాదాన నగరాలకు రైళ్ళు నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    దిమాపూర్ లో ఎయిర్ పోర్ట్ కలదు. ఇక్కడనుండి దేశం లోని ప్రధాన నగరాలకు విమానాలు నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed