Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» తూర్పు గారో హిల్స్

తూర్పు గారో హిల్స్ – మానవజాతి నాశనం చేసినా చెదరనిది!  

తూర్పు గారో హిల్స్, మేఘాలయ లోని 11 జిల్లాలలో ఒకటి. ఇది పూర్తిస్థాయి జిల్లాగా మార్చిన నాలుగు సంవత్సరాల తరువాత మేఘాలయ రాష్ట్రం స్థాపించబడింది. తూర్పు గారో హిల్స్ విల్లియంనగర్ జిల్లా పరిపాలనా ప్రధానకార్యాలయం నుండి పనిచేస్తుంది. విల్లియంనగర్, మేఘాలయ మొదటి ముఖ్యమంత్రి కెప్టెన్ విల్లియంసన్ సంగ్మా పేరుతో నిర్మించిన ఒక విలక్షణమైన పట్టణ ప్రాంతం. విల్లియంనగర్ ప్రణాళికా నగరం కావడంతో, అన్ని ప్రాధమిక సౌకర్యాలను కలిగిఉండి, రాష్ట్రంలోని అభివృద్ది చెందుతున్న నగర కేంద్రాలలో ఒకటిగా ఉంది.

4

2603 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ తూర్పు గారో హిల్స్, దక్షిణాన దక్షిణ గారో హిల్స్, తూర్పున తూర్పు ఖాసి హిల్స్, పడమర పడమర గారో హిల్స్, ఉత్తరాన అస్సాం లోని భాగాల ద్వారా కట్టుబడి ఉంది. తూర్పు గారో హిల్స్, మేఘాలయ లోని ఖసిస్ తెగ తరువాత రెండవ అతిపెద్ద తెగ గారో తెగ భారీ జనసాంద్రతను కలిగిఉంది. ఈ జిల్లలో హాజోంగ్ లు, రాభా లు, కొచె లు, బనైయ్ లు, డాలు లు, బోరోలు కూడా పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు.

తూర్పు గారో హిల్స్ వృక్ష, జంతుజాలాలను బాగా కలిగిఉంది. ఇంకా అన్వేషి౦చబడని తూర్పు గారో హిల్స్ పర్యాటకం, శక్తివంతంగా అభివృద్దిచెంది, రాష్ట్ర ఆదాయానికి ఒక ప్రధాన వనరుగా తయారైంది. తూర్పు గారో హిల్స్ పర్యాటకం అత్యద్భుతమైన అందానికంటే ఇంకా ఎక్కువ. చరిత్ర, సంస్కృతి జిల్లా పర్యాటక అవకాశాలు కల్పించడంలో అంతర్భాగమయింది.

తూర్పు గారో హిల్స్ చేరుకోవడ౦ ఎలా

విల్లియంనగర్, గారో హిల్స్ లోని అతిపెద్ద పట్టణం తుర నుండి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. విల్లియంనగర్ నుండి తుర ప్రయాణానికి షుమారు 1 గంట 30 నిముషాలు పడుతుంది. పర్యాటకులు ఈ మార్గంలో రాష్ట్ర ప్రభుత్వ బస్సులలో వెళ్ళవచ్చు లేదా కాబ్ బుక్ చేసుకోవచ్చు.

తూర్పు గారో హిల్స్ వాతావరణం

తూర్పు గారో హిల్స్ లో వేసవి వేడిగా ఉంటే, శీతాకాలం చలిగా ఉంటుంది. దేశంలోని ఈ భాగంలో వర్షాకాలంలో భారీవర్షాలు కురుస్తాయి. సమశీతోష్ణ వాతావరణం ఉండే వేసవి ప్రారంభం, శీతాకాల సమయంలో తూర్పు గారో హిల్స్ ని సందర్శించడం ఉత్తమం.

తూర్పు గారో హిల్స్ సందర్శనకు ఉత్తమ సమయం

తూర్పు గారో హిల్స్ అద్భుతమైన ప్రదేశాలను సందర్శించడానికి శీతాకాలం సరైన సమయం.

తూర్పు గారో హిల్స్ వాతావరణం

తూర్పు గారో హిల్స్ అద్భుతమైన ప్రదేశాలను సందర్శించడానికి శీతాకాలం సరైన సమయం. శీతాకాలంలో ఎక్కువ చలి లేకుండా స్థల సందర్శనకు అనువుగా ఉంటుంది. సాహసౌత్సహికులు, పర్వతారోహకులు కూడా ఈ ప్రాంత సందర్శనకు ఇదే మంచి సమయమని గుర్తిస్తారు. అయితే, ఇక్కడికి ప్రయాణించేటపుడు ఊలు దుస్తులు తీసుకెళ్లడం అవసరం.

తూర్పు గారో హిల్స్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

తూర్పు గారో హిల్స్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం తూర్పు గారో హిల్స్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? తూర్పు గారో హిల్స్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా 51 జాతీయ రహదారి, 62 జాతీయ రహదారి తూర్పు గారో హిల్స్ జిల్లాని దాటుతాయి, ఇవి ఈ జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాలకు ప్రధాన లైఫ్ లైన్లు. ఈ జాతీయ రహదారులే కాకుండా, ఈ ప్రాంతానికి అనుసంధానించబడి ఉన్న అనేక రాష్ట్ర జాతీయరహదారులు కూడా ఉన్నాయి. పర్యాటకులు షిల్లింగ్, గౌహతి నుండి విల్లియంనగర్ కి తేలికగా ప్రయాణించవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా *తూర్పు గారో హిల్స్ లో రైల్వే స్టేషన్ లేదు మేఘాలయలోని అన్ని ప్రాంతాలకు గువహతి రైల్వే స్టేషన్ ప్రధాన రైలుకేంద్రంగా సేవలందిస్తుంది. పర్యాటకులు గువహతి కి దేశంలోని ఏ ప్రాంతం నుండైనా రైలులో తేలికగా చేరుకోవచ్చు. గువహతి చేరుకున్నాక, పర్యాటకులు స్టేషన్ నుండి షుమారు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంతర్ రాష్ట్ర బస్ టర్మినల్ నుండి బస్సులో వెళ్ళవచ్చు. తూర్పు గారో హిల్స్ కి సమీప రైల్వే స్టేషన్ గౌహతి
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా మేఘాలయ లోని ఏకైక విమానాశ్రయం ఉమ్రోయి లో ఉంది, ఇది షిల్లోంగ్ రాష్ట్ర రాజధాని నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే, గువహతి లోని లోకప్రియ గోపీనాథ్ బోర్దోలోయి అంతర్జాతీయ విమానాశ్రయం నుండి విమానంలో వెళ్లి, తరువాత 51 జాతీయ రహదారిపై గారో హిల్స్ చేరుకోవడం సరైన ఎంపిక.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu