Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ఎల్లోరా

ఎల్లోరా - ప్రపంచ వారసత్వ సంపదలో ఒకటి

33

ఎల్లోరా పురాతత్వ ప్రదేశం ఔరంగాబాద్ కు 30 కి.మీ.ల దూరంలో ఉంది. దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు. ఈ ప్రదేశం మహారాష్ట్రలో కలదు. ఈ ప్రదేశాన్ని ప్రారంభంలో రాష్ట్రకూట వంశస్ధులు పునర్నించారు.  ఎల్లోరా మొత్తంగా 34 గుహలు కలిగి ఉంది. ఈ నిర్మాణాలు మూడు గ్రూపులుగా వర్గీకరించారు. బౌద్ధమత, హిందూ మత మరియు జైన మత గ్రూపులుగా కలవు. బౌద్ధమతానికి మొదటి 12 గుహలు, హిందూ మతానికి తర్వాతి 17 గుహలు, జైన మతస్ధలకు 5 గుహలు కలవు. ఈ తవ్వకాలన్నీ ఒకదానికొకటి సమీపంలోనే ఉండి ఆ కాలంలో ఈ మతాలమధ్య గల పరమత సహనాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

ఎల్లోరా - గుహల ప్రపంచం మొదటి గుహల సముదాయం బౌద్ధ మతానికి సంబంధించినది. ఎల్లోరా గుహలను మొదటగా బౌద్ధులు క్రీ. శ 450 నుండి 700 సంవత్సరాల మధ్య తవ్వకాలు జరిపారు. వాటిలో 12 గుహలను వెల్లడించగలిగారు వాటిని గుహలు 1 - 5 గాను మరియు గుహలు 6 - 12 గాను విభజించారు.

బ్రాహ్మణుల గుహలనే హిందూ గుహలని కూడా పిలుస్తారు. ఇవి గుహ నెం.13 నుండి గుహ నెం.29 వరకు ఉంటాయి. మొత్తంగా 17 గుహలు గా పడమటి ప్రాంతంలో కలవు. ఈ గుహలన్నీ వివిధ కాలాలలో నిర్మించారు.  

ఎల్లోరాలో చివరగా జైనమత గుహలను కనుగొన్నారు. ఇక్కడి తవ్వకాలలో లభ్యమైన గుహలు అసంపూర్తిగా ఉన్నప్పటికి ఎంతో వివరవంతంగా ఉన్నాయి. వీటి వివరాల వెల్లడిలో పరిశోధకులకు సునాయాసంగా ఉండి అప్పటి వరకు వారు పరిశోధించిన బౌద్ధ మరియు హిందు గుహల శ్రమకు ఏ మాత్రం పోలిక లేదు.

గుహ నెం.30 నుండి గుహ నెం.34 వరకు ఈ గ్రూపులో అయిదు గుహలున్నాయి. అన్ని గుహలలోను ప్రధానంగా ఉన్న వస్తువు నీటి తొట్టెలు. ఈ గుహలలో ఆ కాలంనాటి సన్యాసులు, వారి శిష్యులు ఉండేవారు. కనుక వారికి నీటి సౌకర్యం చేతికి అందుబాటులో ఉండటం అవసరమయ్యేది. అంతేకాక వారు వర్షపు నీటిని నిలువ చేసే ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఆ నీటిని గుహలలోని పెద్ద రాళ్ళను కోసి ధారలుగా తమ నీటి తొట్టెలలోకి పట్టేవారు.

ఎల్లోరాకు ఎపుడు మరియు ఎలా వెళ్ళాలి? గుహలను సంవత్సరంలో ఏ సమయంలో అయినా సరే దర్శించవచ్చు. వాతావరణం ప్రధానంగా చల్లగాను, ఆహ్లాదకరంగాను ఉంటుంది. అయితే, వేసవిలో కొద్దిపాటి వేడితో అసౌకర్యమనిపిస్తుంది. వర్షాకాలం సందర్శనకు ఎంతో బాగుంటుంది. ఇక్కడ కల ఒక నది పూర్తి ప్రవాహంతో ఆ సమయంలో ప్రవహించి చుట్టుపట్ల అందాలను మరింత పెంచుతుంది. ఉష్ణోగ్రతలను తగ్గిస్తుంది

ఇక ప్రయాణం ఎలా చేయాలి అంటే, విమాన, రైలు, రోడ్డు మార్గాల ద్వారా  సమీపంలోని ఔరంగాబాద్ పట్టణం చేరాలి. ఔరంగాబాద్ ఎల్లోరాకు సమీపంగా ఉంటుంది. ఔరంగాబాద్ విమానాశ్రయం గుహలకు దగ్గరగా ఉండి తేలికగా చేరేలా ఉంటుంది. ఔరంగాబాద్ రైలు స్టేషన్ కూడా ఎల్లోరా గుహలకు 45 నిమిషాల దూరంలో కలుపబడి ఉంది. రోడ్డు ప్రయాణం అంటే 30 కి.మీ. ల దూరంలో కల అహ్మదాబాద్ జంక్షన్  నుండి కూడా ఎల్లోరా గుహలకు తేలికగా చేరుకోవచ్చు. ఆటోలలో ఇక్కడనుండి గుహలకు చేరుకోవచ్చు.

ఎల్లోరా గుహలు భారత దేశ సంస్కృతి ప్రతిబింబించే పది ప్రధాన స్ధలాలలో  ఒకటిగా పరిగణించవచ్చు. సంస్కృతిపరంగా, జాతి పరంగా ఎన్నో విలువలు కల ఈ గుహలు మూడు మతాల వ్యాప్తిని భారతదేశం నుండి ప్రపంచానికి అందించాయి.

ఎల్లోరా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఎల్లోరా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఎల్లోరా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఎల్లోరా

  • రోడ్డు ప్రయాణం
    బస్ ప్రయాణం విమానం మరియు రైలు వలెనే బస్ ప్రయాణం కూడా ఔరంగాబాద్ నుండి చేయవలసిందే. మహా రాష్ట్రలోని అన్ని ప్రాంతాలనుండి ఔరంగాబాద్ కు బస్ లు నడుస్తాయి. ఎల్లోరా నుండి ఔరంగా బాద్ కు 30 కి.మీ.లు ఉంటుంది. దీనిని ఆటోలపై ప్రయాణించవచ్చు. ప్రయాణపు ఛార్జి షుమారుగా రూ.400 గా ఉంటుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం ఎల్లోరా కు రైలు స్టేషన్ లేదు. ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ ఎల్లోరాకు సమీప రైలు స్టేషన్. 45 నిమిషాలలో రైలు స్టేషన్ చేరవచ్చు. ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ మహారాష్ట్ర మరియు ఇతర నగరాలకు రైళ్ళ రాకపోకలతో అనుసంధానించబడి ఉంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    ఎల్లోరా గుహలకు ఎలా చేరాలి? విమాన ప్రయాణం ఎల్లోరాకు సమీప విమానాశ్రయం 20 కి.మీ. ల దూరంలో కల ఔరంగాబాద్ విమానాశ్రయం. ఔరంగాబాద్ విమానాశ్రయం భారతదేశంలోని ముంబై, ఉదయపూర్, ఢిల్లీ వంటి అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu