నటదీశ్వర ఆలయం తమిళనాడు లోని ప్రసిద్ధ ఈరోడ్ పట్టణంలో ఉంది. ఈ ఆలయం కావేరి నది ఒడ్డున ఉండటం వలన హిందువులు దీనిని ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ ఆలయం శివునికి చెందినది. ఈ ఆలయాన్ని చోళ రాజులు నిర్మించడం వలన మూడు వేల ఏళ్ళ కంటే పైబడిన చరిత్రను కల్గి ఉంది. ఇక్కడి దేవుడిని అగస్తీస్వర్ అంటారు. ఈ ఆలయం సాధారణ దక్షిణ భారత వాస్తు శైలిని కల్గి, దీని నిర్మాణానికి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడకు వచ్చే వారు ఏదైనా కోరికతో వస్తే వారి కోరికలు తప్పనిసరిగా తీరుతాయని స్థానికులు విశ్వసిస్తారు.పైగా, ఈ ఆలయం నుండి రాష్ట్రం లోని ఇతర ప్రాంతాలకు చక్కటి అనుసంధానం ఉంది. ఈ ప్రాంతాన్ని బస్సు ద్వారా చేరవచ్చు కారణం ఇక్కడకు బస్సులు లెక్కకు మిక్కిలిగా ఉంటాయి. ఈ ప్రాంతానికి నది ద్వారా కూడా చేరవచ్చు. ఆలయ ప్రాంగణాన్ని ప్రవేశించిన వారికి ఒక దివ్యమైన భావన కల్గుతుంది.



Click it and Unblock the Notifications