గణపతిపులే బీచ్ లో వెండి లాంటి తెల్లటి ఇసుక ఉంటుంది. భారత దేశ కరేబియన్ గా పిలిచే ఈ బీచ్ లో లోతులేని మడుగులో కలుస్తుంది నీటి అడుగున ప్రమాద కరమైన రాళ్ళు ఉండడం వల్ల ఇక్కడ ఈత కొట్టటం నిషేధించారు. అయితే కయకింగ్ క్రీడ మాత్రం ఇక్కడి స్థానికులు, యాత్రికులలో ప్రజాదరణ పొందింది. ఇక్కడి కొండశిఖరం పైనుండి దృశ్యం ఎంతో మనోహరంగా ఉంటుంది. బీచ్ వెంబడి మామిడి, జీడి చెట్లు వరుసగా కనబడతాయి.మొదటి సారి సందర్శనకు వచ్చిన యాత్రికులు బీచ్ వద్ద దొరికే మరాఠీ రుచులు తప్పనిసరిగా రుచి చూడాలి. ఒంటె సవారి కూడా ప్రయత్నించండి.



Click it and Unblock the Notifications