మోడీ నగర్ ఉత్తర ప్రదేశ్ లోని ఒక పారిశ్రామిక కుటుంబానికి చెందిన సెట్ గుజార్ మాల్ మోడీ పేరుతో నిర్మించారు. ఇది ఘజియాబాద్ కు ఈశాన్యంగా 25 కి.మీ.ల దూరంలో ఢిల్లీ - ముస్సూరీ నేషనల్ హై వే 58 పై కలదు. మోడీ నగర్ ఒక కొత్త టవున్. 1975 లో ఘజియాబాద్ ను జిల్లా చేసినపుడు, ఇది తాలుకా అయ్యింది. ఇక్కడ 19వ శతాబ్దంలో రాణి బాల బాయి సిందియా చే నిర్మించబడిన ఒక పురాతన టెంపుల్ కలదు. ఈ టవున్ లో మోడీ కుటుంబం స్థాపించిన అనేక పరిశ్రమలు కలవు. వాటిలో 1933 లో వారు స్థాపించిన షుగర్ ఫ్యాక్టరీ ఒకటి.
మోడీ నగర్ ను మొదటిలో 571 ఎకరాలలో స్థాపించారు. ఇది బెగామబాద్ లో ఒక భాగంగా వుండేది. మోడీ నగర్ లో మోడీలు నిర్మించిన ఒక పెద్ద టెంపుల్ కలదు. దీనిని స్థానికులు లక్ష్మి నారాయణ మోడీ టెంపుల్ అని పిలుస్తారు. ఈ టెంపుల్ ను 15.2 ఎకరాలలో నేషనల్ హైవే నెం.58 మార్గం పై నిర్మించారు.



Click it and Unblock the Notifications