భారత దేశంలో ని అత్యాధునీకమైన ప్లానెటోరియంలలో ఒకటైన ఈ ప్లానెటోరియం నగరానికి నడిబోడ్డులో ఎం జి రోడ్డు లో ఉంది. విలక్షణమైన గోపురం మరియు ఏటవాలు గోడలు ఈ ప్లానెటోరియం ని మిగతా వాటినుండి ప్రత్యేకంగా నిలుపుతున్నాయి.
విద్యార్ధులు ఇంకా అంతరిక్షం అంటే ఆసక్తి కలిగిన ప్రజలు ఇక్కడికి ఎక్కువగా తరలి వస్తారు. జపనీస్ గోటో జిఎక్స్ పరికరాన్ని సందర్శకుల సౌకర్యార్దం ఇక్కడ సంస్థాపించారు. అంతరిక్షం గురించి కొన్ని తెలిసిన రహస్యాలను చూడడానికి ఈ పరికరం ఉపయోగపడుతుంది. ప్రతి రోజు ఈ ప్రాంతానికి వందలమంది ప్రజలు విచ్చేస్తారు.
సైన్స్ సెమినార్లకి, వర్క్ షాపులకి అలాగే ఖగోళ శాస్త్రం యొక్క కాన్ఫరెన్స్ ల కి ఈ ప్లానెటోరియం వేదికగా నిలుస్తుంది.



Click it and Unblock the Notifications