కలాసి పట్టణం హొన్నెమర్దులో తప్పక చూడవలసిన ప్రదేశం. ఇక్కడ రెండు శివాలయాలున్నాయి. వీటిని నీల కంఠేశ్వర దేవాలయం మరియు మల్లిఖార్జున దేవాలయాలుగా పిలుస్తారు. ఈ ప్టణం సాగర పట్టణంనుండి 8 కి.మీ.ల దూరంలో ఉంది. సొరబ్ రోడ్డు ద్వారా జోగ్ ఫాల్స్ కు కలుపబడింది. ఈ రెండు శివాలయాలు 12వ శతాబ్దంలో జంకన మరియు డక్కన అనబడే తండ్రీ కొడుకులచే హొయసల కళా నైపుణ్యంతో నిర్మించబడ్డాయి. రెండు శివాలయాలలోకి పెద్దదైన మల్లిఖార్జున దేవాలయం లో ఒక గర్భగృహం, సుకనాశి, రంగమంటపం, బసవమంటపం ఉంటాయి. పర్యాటకులు దేవాలయంలోకి మూడు మార్గాలలో ప్రవేశించవచ్చు. ఈ దేవాలయం నీలకంఠేశ్వర దేవాలయానికి 30 అడుగుల దూరంలో ఉంటుంది. నీలకంఠేశ్వర దేవాలయానికి పైన గోపురం ఉంటుంది. ఈ ప్రదేశం దర్శించే పర్యాటకులు ఇక్కడే ఒక దేవీమాత భువనేశ్వరిని మరియు హొయసల ముద్రను కూడా చూస్తారు.



Click it and Unblock the Notifications