పశ్చిమ బెంగాల్ లోని ఒక దక్షిణాది నగరం ఝర్గ్రాం ను వర్ణించడానికి ఉత్తమ మార్గం ప్రశాంతత. దట్టమైన అడవుల మధ్య, ఎర్ర మట్టి నేలతో ఉన్న ఝర్ గ్రం సందర్శన, పర్యాటకుని జేబును పెద్దగా ఖర్చు పెట్టించదు. సాల్, మహువ వృక్షాలు ఈ అడవి పందిరిలో ఆధిపత్యం చలాయిస్తాయి.
ఈ నగరం కొన్ని చారిత్రిక ఆలయాలు, గత కాలపు రాచరిక భవనాలు, బెంగాలి సంగీతం, నృత్యాన్ని ఆస్వాదించే స్థానికుల సమ్మేళనంతో నిండి ఉంది. ఝర్ గ్రం పర్యాటక రంగం స్వచ్ఛమైన, శుభ్రమైన ప్రదేశం కోసం చూసే పర్యాటకులను నమ్ముకుంది. బెలపహరి, కాంక్రజ్హోల్ పర్వతశ్రేణుల మధ్య ఉన్న ఈ ప్రాంతం ఫోటో గ్రాహకులకు ఒక రంగుల స్వప్న౦.ప్రాకృతిక సౌందర్యం, నిర్మల వాతావరణమే కాక, పర్యాటకులను ఇక్కడి తీర్థయాత్రా స్థలాల వలన కూడా ఈ ప్రాంతం ఆకర్షిస్తుంది. శివుని ఉమాపతి ఆలయం ఝర్ గ్రం లో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఒకటి. కురుంబేరా కోటను 14 వ శతాబ్దంలో కట్టినట్టుగా విశ్వసిస్తారు. దీనిపై ఉన్న ఒరియా శాసనం వలన, దీనికి పురావస్తు ప్రాముఖ్యత ఉంది. అలంపూర్, దుర్గా మాత కనకా ఆలయం, జింకల పార్కు, జంగిల్ మహల్, సావిత్రి ఆలయం ఇతర ప్రముఖ పర్యాటక ఆకర్షణలలో ఉన్నాయి. వివిధ రంగులు, అలంకరణలు, లైట్లు, బాణసంచాలతో రంగులమయమయ్యే దుర్గ, కాళీ పూజ జరిగే కాలం ఈ పట్టణం సందర్శనకు అనువైనది. వారాంతపు ఆటవిడుపు
కోల్కతా నుండి 172 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝర్గ్రాం, నగర రణగొణధ్వనుల నుండి తప్పించుకోవడానికి ఒక అద్భుతమైన వారాంతపు ఆటవిడుపు. హోటళ్ళు, లాడ్జీలు ఉత్తమంగా ఉన్నందున, డబ్బుకు తగిన విలువ లభిస్తుంది.ఝర్గ్రాం చేరడం ఎలా ఝర్గ్రాం చేరడానికి స్థానికంగా అద్దె టాక్సీలు ఉంటాయి లేదా స్వంత కార్లలో వెళ్ళవచ్చు. స్థానిక రవాణా సౌకర్యం పై పెద్దగా నమ్మకాన్ని పెట్టుకోలే౦, మన స్వంత వాహనాన్ని కల్గి ఉండటం మంచిది. ఝర్గ్రాం సందర్శనకు ఉత్తమ సమయం శీతాకాలం ఝర్ గ్రం సందర్శనకు ఉత్తమమైనది.మిడ్నాపూర్ లోని కురుం బేరా కోట కురుం బేరా కోటలో మహమ్మద్ తహీర్ నిర్మించిన మసీదుకు పక్కన 1400 లో నిర్మించిన ఒక శివాలయం ఉంది. ఇది హిందూ ముస్లిముల ఐకమత్యానికి ప్రతీక. దేశ వ్యాప్త పర్యాటకులు దీనిని సందర్శిస్తారు. ఈ కోట చుట్టూ ఉన్న ఎత్తైన గోడలు ఈ ప్రాంతంలో అరుదుగా కనబడే గొప్ప మహత్తును కల్గ చేస్తాయి. ఈ సమీపంలో మీరు ఒక సాయంత్రాన్ని కోట దగ్గర గడుపుదామని అనుకుంటే, సూర్యాస్తమయాన్ని చూసి, ఈ పరిసరాలను అనుభూతి చెందండి.మిడ్నాపూర్ లోని శివుని ఉమాపతి ఆలయం సూచించబడింది ఏడాదంతా పర్యాటకులు సందర్శించే ఈ పురాతన ఆలయంను చూడగానే మనకు కలిగే మొదటి భావన ఆచల వాస్తు శైలి, టెర్రకోట శైలి లో రూపకల్పన. ఇక్కడ పూజించే దైవం సూర్య, హిందువుల సూర్య భగవానుడు. ఈ విగ్రహాన్ని నల్లరాయిలో చెక్కారు. ఈ ఆలయాన్ని 10 లేదా 11 వ శతాబ్దంలో నిర్మించారని విశ్వసిస్తారు.



Click it and Unblock the Notifications