జోర్హాట్ లో బ్రిటిష్ వారి ఉనికిని గుర్తు చేసే పాత భవనాలలో ఒకటి జింఖానా క్లబ్. 1876 ప్రాంతాల్లో జోర్హాట్ పరిసరాల్లోని తేయాకు తోటలను నిర్వహించే బ్రిటిష్ వారికి వినోద కేంద్రంగా జింఖానా క్లబ్ అధికారికంగా స్థాపించారు. నగర కేంద్రం నుంచి క్లబ్ వరకు వేసిన రోడ్డు జోర్హాట్ లోని మొదటి ఆస్ఫాల్ట్ రోడ్డు.
జింఖానా క్లబ్ లో వున్న 9 రంధ్రాలున్న గోల్ఫ్ కోర్స్ ఆసియాలోని అతి ప్రాచీనమైన, ప్రపంచంలోని మూడో ప్రాచీనమైన గోల్ఫ్ కోర్స్. నిజానికి ఇక్కడి అధికారులు ఈ గోల్ఫ్ కోర్స్ ను యునెస్కో ప్రపంచ వారసత్వ భవనాల జాబితాలోకి చేర్చడానికి ప్రయత్నిస్తున్నారు.
పచ్చటి గోల్ఫ్ కోర్స్ మాత్రమె కాక ఈ క్లబ్ లో లాన్ టెన్నిస్, బిలియర్డ్స్, పోలో లాంటి క్రీడలకు కూడా సదుపాయాలూ వున్నాయి. ఒక ఈత కొలను, ఒక బార్, ఒక థియేటర్ తో ఇక్కడి మౌలికవసతులు సంపూర్ణంగా వున్నాయి. ప్రతి ఏటా సి కి నాయుడు అండర్ 19 క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడే నిర్వహిస్తారు.