Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కాబిని - ఏనుగు సమూహాల రాజధాని!

కాబిని - ఏనుగు గుంపుల రాజధాని

21

కర్నాటకలోని కాబిని ప్రాంతం వన్య జీవులకు ప్రసిద్ధి గాంచింది. ఇది నాగర్ హోలే అటవీ ప్రాంతంలో ఒక భాగం. బెంగుళూరుకు 163 కి.మీ. దూరంలో ఉన్న ఈ పర్యాటక స్ధలానికి సందర్శకులు ఎంతో ఇష్టంగా వస్తారు. కాబిని అటవీ ప్రాంతాన్ని అక్కడ కాబిని నది ప్రవహిస్తుండటం చేత, కాబిని పర్యాటక స్ధలంగా పేరు పెట్టారు. నాగర్ హోల్ అటవీ ప్రాంతానికి ఇది ఆగ్నేయంగా ఉంది. సుమారు 55 ఎకరాల ప్రదేశం విస్తరించి దట్టమైన అడవులు, అనేక ఎత్తులు, పల్లాలు, సరస్సులు, ప్రవాహాలు కలిగి రమణీయమైన ప్రదేశంగా చెప్పబడుతుంది.

కాబిని డ్యామ్ ఇక్కడ ఒక పెద్ద సరస్సును ఏర్పాటు చేయటంతో అక్కడకల గ్రామం ఒకటి దానిలో ముణిగిపోయింది. ఫలితంగా ఆ గ్రామం పేరుతో మస్తిగుడి సరస్సు అని దానికి నామకరణం చేశారు. ఈ డ్యామ్ నాగర్ హోల్ ప్రాంతాన్ని బండిపుర అటవీ ప్రాంతాన్ని వేరు చేస్తుంది.   ఆశ్చర్యం కలిగించే జంతు జాలం! ఈ ప్రాంతమంతా వివిధ రకాలుగా వర్షాలు పడి మొక్కలు కూడా కొన్ని ప్రదేశాలలో చిన్నవి గాను, భారీ వర్షాలు పడే చోట పెద్దవిగాను పెరుగుతూంటాయి. ప్రతి సంవత్సరం కొన్ని ప్రాంతాలలో షుమారు 1000 మి.మీ. కంటే అధికంగా కూడా వర్షపాతం నమోదవుతుంది. 

నాగర్ హోల్ అటవీ ప్రాంతంలో పచ్చటి ఆకులు, మొక్కలు తిని జీవించే జంతుజాలం అధికంగా ఉంది. వాటిలో ఏనుగుల సముదాయాలు ప్రత్యేకం. ఈ ప్రాంతంలో ఆసియా ఏనుగులు అధికంగా ఉంటాయి. ఏనుగు శాకాహారి. అధికంగా ఆకులను, కొమ్మలను తింటుంది. కనుక వాటికి ఆహారం విశేషంగా దొరుకుతున్న కారణంగా అక్కడ అవి అధికంగా పెరుగుతాయి. ఈ మొక్క ఆహారాన్ని తినే జంతువులు లేడి, దుప్పి, జింకలు, సంభార్, అటవీ పందులు, కోతులు, ఎన్నో కూడా ఉంటాయి. వీటిని ఆహారంగా తింటూ మరి కొన్ని జంతువులైన పులులు, చిరుత పులులు, వేట కుక్కలు వంటివి కూడా ఈ ప్రాంతంలో పెరుగుతాయి.

అడవిలో సఫారిపై వెళితే, అనేక జంతువులను దగ్గరనుండి చూడవచ్చు. కాబినిలో 300 రకాల పక్షి జాతులు కూడా ఉండి పక్షుల జీవనంలో ఆసక్తి కలవారికి ఈ ప్రాంతం మరింత ఆకర్షణ కలిగిస్తుంది. దీనిని వారు ఒక స్వర్గంగా భావిస్తారు. కాబినిలో ప్రధాన ఆకర్షణ అంటే, జంగిల్ సఫారి మరియు ఎనుగుల సఫారి. సరస్సులలో బోట్ విహారం చేస్తూ అక్కడి మొసళ్ళు, నీరు తాగే జింకలను చూసి ఆనందించవచ్చు.  

అడవులలో నడక, ట్రెక్కింగ్, బోట్ విహారం, సైకిలింగ్, పక్షుల గమనం, రాత్రులలో చలిమంటలు, స్ధానికిగ్రామాల సందర్శనలతో ఎంతో ఆనందం పొందుతారు. కాబిని దేశంలోనే ఒక సహజ సెలవుల విశ్రాంతి ప్రదేశంగా చెప్పబడుతోంది. కర్నాటక రాష్ట్రంలో తప్పక చూడవలసిన ప్రదేశాలలో కాబిని ఒకటి. కనుక ఎట్టి పరిస్ధితులలోను ఈ ప్రాంత సందర్శన మరువకండి.

కాబిని - ఏనుగు సమూహాల రాజధాని! ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కాబిని - ఏనుగు సమూహాల రాజధాని! వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కాబిని - ఏనుగు సమూహాల రాజధాని!

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కాబిని - ఏనుగు సమూహాల రాజధాని!

  • రోడ్డు ప్రయాణం
    బస్ ప్రయాణం - కాబిని సమీపంలోని నగరాలైన బెంగుళూరు, మైసూర్ లకు బస్ సౌకర్యం కలిగి ఉంది. పర్యాటకులు కర్నాటక రాష్ట్ర రవాణా సంస్ధ నడిపే ఎ.సి. నాన్ ఎ.సి బస్ లను వినియోగించవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం - కాబిని ప్రాంతానికి రైల్వే స్టేషన్ లేదు. మైసూర్ రైల్వే స్టేషన్ సమీప జంక్షన్ షుమారు 24.9 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు కలిపి ఉంచుతుంది. మైసూర్ జంక్షన్ నుండి టాక్సీలు, క్యాబ్ లు విరివిగా లభ్యం అవుతాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    కాబిని ఎలా చేరాలి? విమాన ప్రయాణం - బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం అంతర్జాతీయ పర్యాటకులకు స్థానికులకు విమానాశ్రయ సౌకర్యం. ఇది కాబిని నుండి 170 కి.మీ. దూరంలో ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed